Home » Entertainment » Anasuya Slipper Shot Reply To Netizen Who Asked Her Rate Per Day
Entertainment

Anasuya : ఒక్క రోజుకి నీ రేట్ ఎంత?.. నెటిజన్ ప్రశ్నకు అనసూయ దిమ్మతిరిగే సమాధానం ఇదే

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: August 27, 2022, 3:20 pm
Advertisement

Anasuya : ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా అనసూయ ట్రెండ్ అవుతోంది. ఏ క్షణాల లైగర్ సినిమా డిజాస్టర్ మీద పరోక్షంగా ట్వీట్ వేసిందో గానీ.. అప్పటి నుంచి ఇప్పట వరకు ఒకటే మ్యూజిక్కు. అనసూయ ఆపడం లేదు.. ఆమెను ట్రోల్ చేసే వారు కూడా ఆపడం లేదు. ఆమె ఎంతగా రిప్లైలు ఇస్తుంటే.. ట్రోలర్లు అంతగా యాక్టివ్ అవుతున్నారు. ఇక ట్రోలర్లకు ఒక పాడు పద్దతి అని ఏం ఉంటుంది. నోటికొచ్చినట్టుగా వాగేస్తున్నారు. అనసూయను పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు. ఇదంతా కూడా ఆంటీ అనే పదం చుట్టూనే తిరుగుతోంది. ఆంటీని కొందరు ప్రేమగా పిలవొచ్చు..

Advertisement

ఇంకొందరు సెటైరికల్‌గా కూడా పిలవొచ్చు. కానీ అనసూయ మాత్రం తనను ఆంటీ అని పిలవడాన్ని సహించలేకపోతోంది. దీనిపైనే పెద్ద రాధ్దాంతం జరుగుతోంది. ఇదే విషయంలో ఇప్పుడు ట్విట్టర్‌లో అనసూయ పెద్ద యుద్దం చేస్తోంది. ఆంటీ అనే పదం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. అనసూయను ఆంటీ ఆంటీ అని పదే పదే పిలిచి చావకొడుతున్నారు. మీమ్స్, ట్రోల్స్‌ను ఆంటీనే వినిపిస్తోంది. కనిపిస్తోంది. అయితే కొంత మంది నెటిజన్లు మాత్రం తీవ్రంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు గీత దాటేస్తున్నారు.

Anasuya Slipper Shot Reply To Netizen Who Asked Her Rate per day

Advertisement

కానీ అనసూయ మాత్రం తన హద్దుల్లోనే ఉంటోంది. అందరికీ మర్యాద ఇస్తూనే మాట్లాడుతోంది. రిప్లైలు పెడుతోంది. ఇక ఇప్పుడు ఓ నెటిజన్ తారాస్థాయికి వెళ్లాడు. ఒక రోజుకి నీ రేట్ ఎంత? అదే షో ఆర్గనైజ్ చేయడానికి అని డబుల్ మీనింగ్ డైలాగ్‌లో అడిగేశాడు. దీనికి అనసూయ కూడా అంతే స్థాయిలో రిప్లై ఇచ్చింది.. నేనంటే మీకు లోకువ కదా? అండి.. ఇదే ప్రశ్న మీ చెల్లినో లేదా మీకు పెళ్లి అయితే భార్యనో అడగండి.. ఒక్క రోజుకు రేటు ఎంత అని.. అదే ఆఫీస్‌లో.. అని అడిగితే మీరేం చెబుతారు అని చెప్పుతో కొట్టినట్టుగా రిప్లై ఇచ్చింది అనసూయ.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి