Jhansi : సుదీర్ఘ కాలంగా బుల్లి తెర ప్రేక్షకులను మరియు వెండి తెర ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న నటి కమ్ యాంకర్ ఝాన్సీ. ఈమె తెలుగు ప్రేక్షకుల్లో సుపరిచితురాలు. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బుల్లి తెర మరియు వెండి తెరపై తనదైన ముద్రను వేసి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచారు. అందుకే ఆమె కెరీర్ ప్రారంభించి ఇన్నాళ్లయినా కూడా ఆమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నటిగాయాంకర్ గా గొప్ప విజయాలను దక్కించుకున్న ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను అవరోధాలను అధిగమించారు. ఆమె ప్రస్తుతం ఈ స్థాయిని చేరుకోవడానికి సుదీర్ఘమైన కష్టాలను ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సింగిల్ మదర్ గా సోలో జీవితాన్ని గడుపుతున్న ఝాన్సీ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు విమర్శలను ఎదుర్కొంటున్నాయి ఉన్నారు.ఆ విమర్శలను తట్టుకుంటూ వాటికి సమాధానాలు ఇస్తూ కెరీర్ లో మరియు వ్యక్తిగత జీవితంలో ముందుకు వెళ్తున్నారు.
ఎప్పుడూ వార్తల్లో ఉండే ఝాన్సీ ఆ మధ్య మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అనగనగా ఓ ఎద్దు.. దానికి ఒక పుండు.. పుండు లో పురుగులు… ఏంటి కాకుల గోల అంటూ వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు సినిమా పరిశ్రమ పై సెటైర్లు అంటూ ఆ సమయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. సినిమా పరిశ్రమ వారిని మరీ పురుగులు అంటూ విమర్శించిందని ఝాన్సీని కొందరు దుయ్యబట్టారు. ఆ సమయంలో ఝాన్సీ ఆ వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చింది.ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ తాను చేసిన వ్యాఖ్యలు కొన్ని మీడియా సంస్థల గురించి మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది. మా ఎన్నికల విషయంలో కొందరు మీడియా ప్రతినిధులు చేసిన హడావుడి మరియు వారు కనబర్చిన అత్యుత్సాహం కారణంగా మా ఎన్నికలు రసాభాసగా మారాయి.
అందుకే తాను అలాంటి వ్యాఖ్యలు చేసినట్లుగా తెలిసింది. మీడియాను కూడా ఝాన్సీ అలా మాట్లాడి ఉండకూడదు.ఆమె ఇలాంటి విషయాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఝాన్సీ ఇలాంటి సున్నితమైన విషయాలు మాట్లాడేటప్పుడు ఒకటిక రెండు సార్లు ఆలోచించి కాస్త జాగ్రత్త వహిస్తే మంచిది అంటూ కొందరు హెచ్చరిస్తున్నారు. మల్టీ టాలెంటెడ్ అయిన ఝాన్సీ ఇలాంటి చిన్న వివాదాల కారణంగా తన పేరును పోగొట్టుకోవద్దు అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు. భర్త నుండి విడిపోయి జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే లైఫ్ లో ఆనందాలను చూస్తున్న ఝాన్సీ ఇలాంటి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.