Home » Entertainment » Anchor Pradeep Second Movie Update
Entertainment

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ రెండవ సినిమా చేస్తాడా? లేదా?… క్లారిటీ ఇచ్చేశాడు

Authored By
Himanshi
The Telugu News | Published on: March 5, 2022, 11:00 am
Advertisement

Anchor Pradeep : యాంకర్ ప్రదీప్ బుల్లితెర సూపర్ స్టార్ అంటూ మంచి పేరును దక్కించుకున్నాడు. బుల్లి తెర పై తనదైన మేనరిజం తో సమయ స్ఫూర్తితో హాస్యాన్ని పండిస్తూ అందరిని ఆకట్టుకునే ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు ప్రదీప్ చాలా సినిమా ల్లో నటించాడు. కానీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. యాంకర్‌ గా స్టార్ అయిన తర్వాత సినిమాల్లో హీరోగా నటించేందుకు.. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యాడు.మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా కు మిశ్రమ స్పందన దక్కింది.

Advertisement

ఆ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాట ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా టాక్ పరంగా కాస్త అటు ఇటు అయినా ప్రదీప్ సినిమా అవ్వడం వల్ల అభిమానులు తెగ చూసేశారు. ఆ సినిమా మంచి ఫలితాన్ని దక్కించుకున్నా కూడా ప్రదీపు ఇంకా రెండవ సినిమా ప్రకటించక పోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఆ సినిమా తర్వాత ప్రదీప్ నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయని అంతా ఆశించారు. కానీ ఆయన వద్దకు ఎంతో మంది దర్శకులు వస్తున్నా కూడా సున్నితంగా తిరస్కరించినట్లు గా తెలుస్తోంది.

anchor pradeep second movie update

Advertisement

తాజాగా ఒక చిట్ చాట్‌ లో యాంకర్ ప్రదీప్ మాట్లాడుతూ.. రెండవ సినిమా హీరో గా ఎప్పుడు చేస్తున్నారు అంటూ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. చేద్దాం చేద్దాం అన్నట్లుగా ప్రదీప్ నుండి స్పందన వచ్చింది. అంటే సరైన కథ తన ఇమేజ్ కి.. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేయాలి అనే ఉద్దేశంతో యాంకర్ ప్రదీప్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆ స్థాయి స్క్రిప్ట్ ఎవరు కూడా ఆయన వద్దకు తీసుకు వెళ్లడం లేదట. ఈ ఏడాదిలో సినిమాని పక్కాగా ఫైనల్ చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా యాంకర్ ప్రదీప్ ప్రయత్నాలు చేస్తాడు అని అంతా భావిస్తున్నారు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి