Rashmi Gautam : నేనూ అలాంటి కూతురినే.. యాంకర్ రష్మీ ఆవేదన
rashmi gautam బుల్లితెరపై, వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపు సాధించికున్న రష్మీ.. సోషల్ మీడియాలో మాత్రం కొత్తగా కనిపిస్తుంది. తెరపై ఎంతలా నవ్వులు చిందిస్తూ కనిపిస్తు ఉంటుందో.. సోషల్ మీడియాలో అంతగా ఆవేదన చెందుతూ ఉంటుంది. సమాజంలోని జీవహింస, మూగజీవ రక్షణ కోసం పాటు పడుతూ ఉంటుంది. మహిళలపై జరిగే అకృత్యాలపైనా స్పందిస్తుంటుంది.
నేనూ అలాంటి కూతురినే.. యాంకర్ రష్మీ ఆవేదన rashmi gautam
అయితే రష్మీ పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. రష్మిని చిన్నతనం నుంచి కూడా తన అమ్మే పెంచింది. అమ్మే అన్నీ అయి పెద్దదాన్ని చేసిందని రష్మీ చెబుతుంటుంది. రష్మికి నాన్న లేడు. తన అమ్మ సింగిల్ పేరంట్ అని, ఎంతో కష్టపడిందని రష్మీ చెబుతూ ఉంటుంది. అయితే సింగిల్ పేరెంట్ కష్టాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.
మరీ ముఖ్యంగా ఆడవారికి ఆ కష్టాలు ఎక్కువ. పైగా స్కూల్‌లో అయితే అందరూ గేలి చేస్తుంటారు. నాన్న లేడు అంటూ కామెంట్లు పెడుతుంటారు. తాజాగా ఇదే విషయం మీద రష్మీ స్పందించింది. మనం ఇప్పుడు కాస్త మంచి సమాజంలోనే ఉన్నా కూడా నేను సింగిల్ పేరింట్ అవ్వడంతో కొత్త స్కూల్‌లో వింత అనుభవాలను ఎదుర్కొన్నాను అని ఓ అమ్మాయి పోస్ట్ చేసింది. దానిపై రష్మీ స్పందిస్తూ.. నేను కూడా అలా పెరిగిన అమ్మాయినే ఆ బాధలేంటోనాకు తెలుసు.. కానీ సమాజం మారుతుందని ఆశిస్తున్నాను.. పిల్లల్ని పేరెంట్స్ విలువతో పెంచుతారని ఆశిస్తున్నాను అంటూ రష్మీ చెప్పుకొచ్చింది.