Home » Entertainment » Anchor Rashmi Gautam Jewellery News
Entertainment

Rashmi Gautam : ఆరు లక్షల బంగారం కొన్న యాంకర్ రష్మీ .. బిల్లు ఎవరు కట్టారో తెలుసా ..??

Authored By
aruna
The Telugu News | Published on: October 27, 2023, 2:00 pm
Advertisement

Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్ రష్మికి ఎటువంటి గుర్తింపు ఉందో అందరికీ తెలుసు. జబర్దస్త్ షో ద్వారా ఈ బ్యూటీ కి ఎనలేని క్రేజ్ వచ్చింది. అప్పుడప్పుడు వెండితెర మీద కూడా కనిపిస్తూ సందడి చేస్తుంటారు. రష్మి గౌతమ్ ఇప్పటికే పలు సినిమాలలో హీరోయిన్గా నటించింది కానీ స్టార్ స్టేటస్ మాత్రం దక్కించుకోలేదు. హీరోయిన్గా సెటిల్ అవ్వడానికి లిప్ కిస్ లు కూడా పెట్టింది. కానీ అవేమీ రష్మీకి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తీసుకురాలేదు. ఇక బుల్లితెరపై యాంకర్ రష్మీ సుడిగాలి సుధీర్ జోడి కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .

Advertisement

ఈటీవీలో ప్రసారమయ్యే పలు షోలలో వీరిద్దరి హంగామా మామూలుగా ఉండదు. అంతలా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. దీంతో బుల్లితెరపై రష్మీకి బాగా అవకాశాలు వస్తున్నాయి. కానీ వెండితెర మీద చాలా స్లోగానే ఉందని చెప్పాలి. ఇక బయట కూడా రష్మీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఇటీవల జ్యువలరీ షాప్ లో ఆరు లక్షల బంగారం కొనుగోలు చేస్తే ఆ బిల్లును ఓ రాజకీయ నాయకుడు కట్టారని సమాచారం. అంతేకాకుండా ఆ యాడ్ చేసినందుకు డిస్కౌంట్ ఆఫర్ కూడా అడిగిందట. దీంతో ప్రస్తుతం రష్మీ కి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇకపోతే సెలబ్రిటీలు షాపింగ్ మాల్స్, జ్యూవెలరీ షాపులు ఓపెన్ చేయడం చాలా కామన్ విషయం. ఇక వాళ్ళు ఓపెన్ చేసినందుకుగాను ఆ షాపు వాళ్ళు ఎంతో కొంత వాళ్లకు గిఫ్ట్ గా ఇస్తుంటారు. అయితే తాజాగా రష్మి విషయంలో కూడా ఇదే జరిగి ఉంటుందని అభిమానులు అంటున్నారు. ఇక రష్మీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లు అవుతున్నా ఆమె ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. మరోవైపు సుధీర్ కూడా పెళ్లి చేసుకోకుండా సినిమాలలో బిజీగా ఉన్నారు. ఇక ఎప్పటినుంచో అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. స్క్రీన్ పై బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరు రియల్ లైఫ్ లో కూడా కపుల్ గా కొనసాగాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. మరీ సుధీర్, రష్మీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి