Anchor Rashmi week end party
Anchor Rashmi : బుల్లితెరకు పరిచయం చేయనక్కర్లేని పేరు రష్మీ గౌతమ్. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్ కాలేదు.గతేడాది లాక్‌డౌన్‌లోనే రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. గతంలో సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని పలుమార్లు చెప్పుకొచ్చింది.
రష్మీ వివాహంపై ఇప్పటికీ అనేక ప్రచారాలు నడుస్తూనే ఉంటాయి. దానిపై ఈ అమ్మడు ఎలాంటి సమాధానం ఇవ్వదు. రష్మీ గౌతమ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు, ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలోనూ పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. అదే విధంగా లేటెస్ట్ ఫొటోషూట్లతోనూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంటుంది. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో రష్మీ గౌతమ్ ఓ రెస్టారెంట్ లో తన స్నేహితులరాలితో చిల్ అవుతూ కనిపించింది. సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ చీర్స్ చెబుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. కొందరు నెటిజన్లు తనకు మద్యం సీసా ఎమోజీలను షేర్ చేస్తూ క్రేజీగా చీర్స్ చెబుతున్నారు.
Anchor Rashmi week end party
తను పోస్ట్ చేసిన వీడియోను లైక్ లు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. రష్మీలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు.
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
This website uses cookies.