Anchor Rashmi : వీకెండ్ పార్టీ.. ఏం తాగుతున్నావ‌మ్మా యాంకర్ రష్మీ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anchor Rashmi : వీకెండ్ పార్టీ.. ఏం తాగుతున్నావ‌మ్మా యాంకర్ రష్మీ..!

Anchor Rashmi : బుల్లితెర‌కు ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు ర‌ష్మీ గౌత‌మ్. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్‌ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్‌ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్‌ కాలేదు.గతేడాది లాక్‌డౌన్‌లోనే రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. గతంలో సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి […]

 Authored By sandeep | The Telugu News | Updated on :13 June 2022,4:30 pm

Anchor Rashmi : బుల్లితెర‌కు ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు ర‌ష్మీ గౌత‌మ్. తెలుగులో ప్రముఖ కామెడీ షోకు యాంకరింగ్‌ చేస్తున్న రష్మీ సుడిగాలి సుధీర్‌తో లవ్‌ట్రాక్‌తో మరింత ఫేమస్‌ అయ్యింది. బుల్లితెరపై వీరిద్దరి జోడీకి ఎంత మంది అభిమానులున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లో అడపాదడపా పాత్రలు చేసినా అవి అంతగా సక్సెస్‌ కాలేదు.గతేడాది లాక్‌డౌన్‌లోనే రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది. గతంలో సుడిగాలి సుధీర్‌తో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలను ఆమె ఖండించిన సంగతి తెలిసిందే. తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌ అని పలుమార్లు చెప్పుకొచ్చింది.

ర‌ష్మీ వివాహంపై ఇప్ప‌టికీ అనేక ప్ర‌చారాలు న‌డుస్తూనే ఉంటాయి. దానిపై ఈ అమ్మ‌డు ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌దు. రష్మీ గౌతమ్ ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు, ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలోనూ పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటుంది. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకుంది. అదే విధంగా లేటెస్ట్ ఫొటోషూట్లతోనూ సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తుంటుంది. తాజాగా ఓ వీడియో షేర్ చేసింది. ఇందులో రష్మీ గౌతమ్ ఓ రెస్టారెంట్ లో తన స్నేహితులరాలితో చిల్ అవుతూ కనిపించింది. సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ చీర్స్ చెబుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. కొందరు నెటిజన్లు తనకు మద్యం సీసా ఎమోజీలను షేర్ చేస్తూ క్రేజీగా చీర్స్ చెబుతున్నారు.

Anchor Rashmi week end party

Anchor Rashmi week end party

Anchor Rashmi ; ర‌ష్మీ కూల్ లుక్స్..

తను పోస్ట్ చేసిన వీడియోను లైక్ లు, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. ర‌ష్మీలో మరో కోణం కూడా దాగి ఉంది. రష్మీ జంతు ప్రేమికురాలు. చాలా సందర్భాల్లో రష్మీ జంతువులపై తన ప్రేమ చాటుకుంది. లాక్ డౌన్ టైంలో ఫుడ్ లేక అల్లాడుతున్న జంతువులకు రష్మీ స్వయంగా ఆహారం అందించింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. జంతువులపై హింసాయుత సంఘటనలు ఏమైనా జరిగితే రష్మీ వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందిస్తుంది. గ్లామర్ విషయంలో కూడా రష్మీ కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలాగని రష్మీ ఓవర్ డోస్ గా ఎప్పుడూ అందాలు ఆరబోయలేదు.

 

View this post on Instagram

 

A post shared by Rashmi Gautam (@rashmigautam)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది