
Anchor Shyamala : యాంకర్ శ్యామలని అర్ధరాత్రి వేధించిన ఆకతాయిలు... సీక్రెట్ బయటపెట్టిన యాంకరమ్మ..!
Anchor Shyamala : యాంకర్ శ్యామల.. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటీవల యాంకర్‌గా ఓ ఊపు ఊపిన ఈ అందాల ముద్దుగుమ్మ బిగ్ బాస్‌లో కూడా పాల్గొని రచ్చచేసింది. ఒకసారి హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన కూడా తిరిగి రీఎంట్రీ ఇచ్చి తెగ సందడి చేసింది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే అరాచకం పీక్స్‌లో ఉంటుంది. చీరకట్టులోను ఈ భామ చేసే అరాచకం మాములుగా లేదు. ప్రస్తుతం వెండితెర మీద కూడా రాణిస్తుంది. గత ఏడాది విడుదలైన విరూపాక్ష చిత్రంతో శ్యామల కీలక రోల్ పోషించి తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. ఇప్పుడు కూడా శ్యామల బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు వెండితెరపై సత్తా చాటుతుంది. అయితే ఇటీవల శ్యామల పలుకాంట్రవర్షీ విషయాలతో హాట్ టాపిక్‌గా మారుతుంది.
గతంలో పలు సందర్భాలలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన శ్యామల కెరీర్ బిగినింగ్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలు గురించి చెప్పుకొస్తూ ఆసక్తికర కామెంట్స చేసింది. తాను సినిమాలలో రాణించాలని హైదరాబాద్‌కి తన అమ్మతో కలిసి వచ్చినట్టు పేర్కొంది. ఇక తనకు సీరియల్స్ అవకాశాలు రావడంతో తాను నటించినట్టు పేర్కొంది. ఆ సమయంలో కొన్ని ఇబ్బందులు తనకు ఎదురైనట్టు పేర్కొంది. తనని కొందరు ఇబ్బంది పెట్టేవారని, లవ్ ప్రపోజల్స్‌తో విసిగించారని పేర్కొంది. ఇక తనకు లవ్ ప్రపోజల్్ కూడా ఎక్కువ కావడంతో ఒప్పుకున్న సీరియల్స్ పూర్తి చేసి ఇంటికి వెళ్లిపోదాం అనుకుందట. ఓ కెమెరామెన్ అర్ధరాత్రి కాల్స్ చేసి తనని చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొంది.
అయితే తనకు అర్ధరాత్రి కాల్స్ చేస్తున్న సమయంలో ఒకరోజు అమ్మ కాల్ లిఫ్ట్ చేసింది. మీకు మగదిక్కు లేదు. నేను ఏదైనా చేయగలను అంటూ బెదిరించడంతో అమ్మ చాలా భయపడింది.నేను మాట్లాడుతుంటే మీ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయడం లేదు.. మీరైనా చెప్పండి అని భయపెట్టాడని శ్యామల తెలియజేసింది. అయితే ఆ టఫ్ సిట్యేయేషన్‌ని ఈ భామ ఎలా డీల్ చేసిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక శ్యామల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శ్యామల యాంకర్ గా, నటిగా రాణిస్తూనే సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ రచ్చ చేస్తున్న విషయం మనందరికి తెలిసిందే.
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
This website uses cookies.