Home » Entertainment » Anchor Suma Funny Comments On Lasya In Cash Latest Promo
Entertainment

lasya : ఫ్రీ అంటే దేనికైనా వచ్చేస్తారు కదా?.. లాస్య పరువుతీసిన యాంకర్ సుమ

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: December 28, 2021 11:35 am
Advertisement

lasya : సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాల నుండి విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుని దూసుకుపోతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ వారం ఈ కార్యక్రమం నూతన సంవత్సరం రోజు ప్రసారం కావడంతో ఈ కార్యక్రమానికి లవ్లీ కపుల్స్ హాజరయ్యారు.ఈ సందర్భంగా సుమ వారందరితో కలిసి ఎంతో సరదాగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.

Advertisement

సుమ నిత్యం తన దైన శైలిలో పంచులు వేస్తూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ జంట లపై కూడా ఎన్నో రకాల పంచులు వేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమ ఈ జంటలను ఎన్నో రకాల ప్రశ్నలు అడిగి వారి నుంచి సమాధానాలు రాబట్టారు. అయితే ఈ ప్రోమోలో సుమ ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ గురించి లాస్య మాట్లాడటంతో సుమ తనదైన శైలిలో పంచ్ వేసి లాస్య పరువు మొత్తం తీసింది.

Anchor suma funny comments on lasya in cash latest promo

Advertisement

lasya : లాస్యపై సుమ కౌంటర్లు..

ఈ కార్యక్రమంలో భాగంగా సుమ ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ గురించి మాట్లాడుతూ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ అని చెప్పగానే రెండు రోజుల నుంచి స్టిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నామని లాస్య చెప్పగానే వెంటనే సుమ స్పందిస్తూ మీరు ఫ్రీ అంటే ఎక్కడికైనా వచ్చేస్తారు అంటూ లాస్య పై పంచ్ వేసి తన పరువు మొత్తం తీసింది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా జంటల పై కూడా సుమ తనదైన శైలిలో పంచు డైలాగులు వేస్తూ అందరినీ ఎంతగానో సందడి చేస్తోందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వినోదాన్ని చూడాలంటే జనవరి 1 వరకు వేచి చూడాలి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి