Home » Entertainment » Anchor Suma Talk Show Suma Adda Getting Bad Reviews
Entertainment

Suma Adda Show : సుమ అడ్డా టాక్‌ షో కి అప్పుడే అతిథులు కరువయ్యారా?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 2, 2023, 12:20 pm
Advertisement

Suma Adda Show : తెలుగు బుల్లి తెరపై సుమ లేడీ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె ఏ కార్యక్రమానికి యాంకరింగ్ చేసినా కూడా ఆ కార్యక్రమం నెంబర్ 1 గా నిలుస్తుంది అంటూ దాదాపు రెండు దశాబ్దాలుగా నిరూపితం అవుతూనే ఉంది. ఒకానొక సమయంలో సుమ ప్రతి ఒక్క కార్యక్రమంలో కనిపిస్తూ సందడి చేస్తూ వచ్చింది. మహిళలు మహారాణులు అనే కార్యక్రమాన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న సుమ క్యాష్ కార్యక్రమం తో కూడా ఈటీవీ ప్రేక్షకులను సుదీర్ఘ కాలం పాటు అలరించిన విషయం తెలిసిందే.

Advertisement

క్యాష్ కార్యక్రమాన్ని ఆపేసి సుమ అడ్డా అనే టాక్ షో ని మొదలు పెట్టిన విషయం కూడా తెలిసిందే. ఆ టాక్ షో విషయంలో మొదటి నుండి ఆమె అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సుమ ఒక మంచి యాంకర్, ఆమె యాక్టివ్ గా గేమ్ షో లు నిర్వహిస్తే బాగుంటుంది. కనుక క్యాష్ కార్యక్రమం సూపర్ హిట్ అయింది. ఆ క్యాష్ కార్యక్రమాన్ని కొనసాగించకుండా టాక్ షో మొదలు పెట్టడం ఏమాత్రం మంచిది కాదు అంటూ ముందే కొందరు హెచ్చరించారు.

Advertisement

anchor suma talk show suma adda getting bad reviews

అన్నట్లుగానే సుమ టాక్ షో కి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. పైగా అతిథుల విషయంలో కూడా అప్పుడే ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి రావడంతో మళ్లీ మళ్లీ ఆ స్థాయి స్టార్స్ కావాల్సిందే అంటూ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతివారం ఆ స్థాయి స్టార్స్ రావాలి అంటే అసాధ్యం. చిన్న స్టార్స్ ని తీసుకొస్తే ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. దాంతో సుమ అడ్డా టాక్ షో తక్కువ కాలానికే కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ బుల్లి తెర వర్గాల్లో చర్చ జరుగుతుంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి