Anchor Suma : సుమ క్యాష్ షో ఆపేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా..!
Anchor Suma : ఈటీవీ లో సుదీర్ఘ కాలంగా టెలికాస్ట్ అవుతున్న సుమ క్యాష్ కార్యక్రమం అర్ధాంతరంగా ముగియడం ఆమె అభిమానులకు మింగుడు పడడం లేదు. ప్రతి శనివారం కూడా ఈటీవీలో ఆమె క్యాష్ కార్యక్రమాన్ని చూడకుండా ప్రేక్షకులు చాలా మంది పడుకోరు, అలాంటి క్యాష్ కార్యక్రమాన్ని సుమ మరియు మల్లెమాల వారు ఆపేయడంతో అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మంచి సక్సెస్ మరియు రేటింగ్ దక్కించుకుంటూ దూసుకు పోతున్న క్యాష్ కార్యక్రమాన్ని ఆపి వేయడానికి అనేక కారణాలు ఉన్నాయని మల్లెమాల వారు చెప్తున్నారు.
సుదీర్ఘ కాలం గా ఈ షో కొనసాగుతున్న కారణంగా కొందరు ప్రేక్షకులు బోర్ గా ఫీల్ అవుతున్నారు. మరో వైపు ప్రతి వారం సెలబ్రిటీ గెస్ట్ లను తీసుకు రావడం కష్టంగా మారుతుంది. అందుకనే క్యాష్ కార్యక్రమాన్ని ఆపేసినట్లుగా మల్లెమాల వారు చెబుతున్నారు. గెస్ట్ లు వచ్చిన వాళ్లే మళ్ళీ మళ్ళీ రావడం వల్ల ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త వారిని వెతికి పట్టుకోచ్చే పరిస్థితి కనపడటం లేదు. అందుకే క్యాష్ కార్యక్రమాన్ని ఆపేసి ఆస్థానంలో సుమా తోనే సుమ అడ్డ అనే ఒక టాక్ షో మొదలు పెట్టినట్లుగా మల్లెమాల వారు అధికారికంగా ప్రకటించారు.
క్యాష్ కార్యక్రమం ఏ విధంగా అయితే అలరించిందో అదే విధంగా సుమ యొక్క టాక్ షో సుమ అడ్డ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది అంటూ మల్లెమాల కు చెందిన ప్రతినిధులు చెబుతున్నారు. సుమ మరియు ఇతర టీమ్ మెంబర్స్ సుమ అడ్డ పై చాలా హోప్స్ పెట్టుకున్నారు. రెండవ ఎపిసోడ్ లోనే మెగాస్టార్ చిరంజీవిని తీసుకు రావడంతో ఈ కార్యక్రమం సూపర్ హిట్ అయినట్లే అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.