Anchor suma : ఈటీవీలో యాంకర్‌ సుమ అడ్డా.. క్యాష్‌ కంటే రెమ్యూనరేషన్‌ ఎక్కువనా..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor suma : ఈటీవీలో యాంకర్‌ సుమ అడ్డా.. క్యాష్‌ కంటే రెమ్యూనరేషన్‌ ఎక్కువనా..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :7 January 2023,6:20 pm

Anchor suma : యాంకర్ గా సుమ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఈటీవీలో ఆమె యాంకరింగ్ చేస్తున్న క్యాష్ షో ఇటీవలే ముగిసింది. సుధీర్ణ కాలంగా కొనసాగుతున్న క్యాష్ షో కి యాంకర్ సుమ భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటూ ప్రచారం జరిగేది. గేమ్ షో అయిన క్యాష్ ప్రేక్షకులకు బోర్ కొట్టింది అనే ఉద్దేశంతో మల్లెమాల వారు ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడంతో ఆ స్థానంలో ఏ కార్యక్రమం వస్తుందా అంటూ అంత ఆసక్తి ఎదురు చూశారు. ఈ శనివారం నుండి క్యాష్ కార్యక్రమం ప్లేస్ లో సుమ అడ్డ అనే కార్యక్రమం రాబోతుంది. మొదటి ఎపిసోడ్ లో సంతోష్ శోభన్ రానుండగా

రెండవ ఎపిసోడ్ లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమం కూడా రద్దు అయింది. కనుక క్యాష్ మరియు ఆలీతో సరదాగా స్థానంలో సుమ అడ్డ షో మొదలైంది. మంచి రెస్పాన్స్ వస్తుందని అంతా భావిస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ టాక్ షో ఒక్కొక్క ఎపిసోడ్ కి దాదాపు లక్షన్నర రూపాయల రెమ్యూనరేషన్‌ ను సుమ తీసుకుంటున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ విషయమై అధికారికంగా క్లారిటీ లేదు, కానీ సుమ కు ఉన్న క్రేజ్ నేపథ్యం లో ఆ రెమ్యూనరేషన్ చాలా తక్కువ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Anchor suma remuneration for suma adda cash show

Anchor suma remuneration for suma adda cash show

మొత్తానికి సుమ అడ్డ టాక్‌ షో మరో లెవెల్ లో ఉంటుందని అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు నమ్మకంగా వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా సుమ అడ్డ టాక్‌ షో లో చిరంజీవి సందడి చేశారు. ఇంకా చాలా మంది ని కూడా సుమ తన అడ్డాలో కూర్చోబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు భావిస్తున్నారు. టాప్ రేటెడ్ షో ల లిస్టులో చేరిపోయే అవకాశాలు ఉన్నాయని తెలుగు బుల్లి తెర విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది