Home » Entertainment » Anchor Varshini Post About Swiggy Latest Decission
Entertainment

Anchor Varshini : నేను కన్న కల అదే.. అసలు విషయం చెప్పిన వర్షిణి

Authored By
Cinema Desk
The Telugu News | Updated on: October 25, 2021, 7:42 pm
Advertisement

Anchor Varshini  : యాంకర్ వర్షిణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు బుల్లితెరకు దూరంగా ఉన్న ఈ అమ్మడు.. తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా టచ్‌లోనే ఉంటుంది. యాంకర్ వర్షిణి ఇప్పుడు బుల్లితెరకు పూర్తిగా దూరమైంది. ఉన్న ఒకే ఒక్క కామెడీ స్టార్స్ షో కూడా వెళ్లిపోయింది. దాని వెనుక అవినాష్ హస్తం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

Advertisement

Anchor Varshini Post About Swiggy Latest Decission

వర్షిణి బయటకు వెళ్లడం, ఆమె స్థానంలో శ్రీముఖిని తీసుకోవడం వెనకాల అవినాష్ ప్లానింగ్ ఉందనే కామెంట్లు వచ్చాయి. కానీ సినిమా ఆఫర్లు రావడంతోనే వర్షిణి ఇలా బుల్లితెరకు దూరంగా ఉండాల్సి వచ్చిందనే తెలుస్తోంది. ఆ మధ్య బిగ్ బాస్ షోలోకి వెళ్తోందనే రూమర్లు కూడా కుప్పలు తెప్పలుగా వచ్చాయి. కానీ చివరకు అవేవీ కూడా నిజం కాలేదు.

Advertisement

Anchor Varshini  వర్షిణి పోస్ట్ వైరల్

Anchor Varshini Post About Swiggy Latest Decission

తాజాగా వర్షిణి ఓ పోస్ట్ చేసింది. అందులో స్విగ్గీ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని హర్షించింది. తమ సంస్థలో డెలివరీ ఉమెన్స్‌గా పని చేస్తున్న వారికి పీరియడ్స్ కాలంలో రెండు రోజులు పెయిడ్ లీవ్‌గా ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రతీ రంగంలోనూ ప్రతీ మహిళకు ఇలాంటి మార్పులే రావాలని కలలు కన్నట్టుగా వర్షిణి చెప్పుకొచ్చింది.

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి