Anil Ravipudi : నందమూరి ఫ్యాన్స్‌ను ఇంత దారుణంగా డిసప్పాయింట్ చేశాడే అనిల్ రావిపూడి ..?

Authored By vamana sai | The Telugu News | Published on: May 21, 2022, 1:00 pm

Anil Ravipudi : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి త్వరలో ఎఫ్ 3 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఎఫ్ 2 కు సీక్వెల్ అనే విషయం తెలిసిందే. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్స్‌గా పూజా హెగ్డే ఐటెం
సాంగ్‌లో కనిపించబోతున్నారు. సోనాల్ చౌహాన్, సునీల్, ప్రగతి, ప్రదీప్ సహా తదితరులు ముఖ్య పాత్రల్లో సందడి చేయనున్నారు. వెంకీకి రేచీకటి, వరుణ్‌కు నత్తి పెట్టి ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌ను రెండింతలు ఇవ్వబోతున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి.

ఈ నెలాఖరున ఎఫ్ 3 సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం నాన్ స్టాప్‌గా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా దర్శకుడు అనీల్ రావిపూడి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పై అప్‌డేట్స్ ఇచ్చారు. ఇదే ఇప్పుడు నందమూరి అభిమానులను బాగా డిసప్పాయింట్ చేస్తోంది. ఎఫ్ 3 తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ మాస్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నాడు అనిల్ రావిపూడి. ఈ విషయాన్ని ఇప్పటికే బాలయ్య కూడా కన్‌ఫర్మ్ చేశారు.అయితే, బాలయ్య తర్వాత అందరూ ఎన్.టి.ఆర్ హీరోగా అనిల్ రావిపూడి కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తీస్తాడని,

Anil Ravipudi comments on Nandamuri Fans

Anil Ravipudi comments on Nandamuri Fans

Anil Ravipudi : తారక్‌కు సంబంధించి కథ లేదని తేలిపోయింది.

దానికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఏదైనా ఇస్తాడని భావించారు. కానీ, ఎఫ్ 3 తర్వాత బాలయ్య సినిమా తప్ప ఎన్.టి.ఆర్ తో సినిమా ఉంటుందనే విషయాన్ని అసలు
ప్రస్తావించలేదు. అంటే, దీనిని బట్టి అనిల్ దగ్గర తారక్‌కు సంబంధించి కథ లేదని తేలిపోయింది. కళ్యాణ్ రాం హీరోగా పటాస్ సినిమాను తీసి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత నుంచి వరుసగా హిట్స్ అందుకుంటూనే ఉన్నాడు. మన హీరోలలో కూడా అనిల్ అంటే మంచి క్రేజ్ ఉంది. కానీ, అనిల్
– తారక్‌ల కాంబో ఫిక్స్ కాకపోవడమే అభిమానులకు నిరాశను కలిగించే అంశం.

vamana sai

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp