Anil Ravipudi : అనీల్ రావిపూడిని ర్యాగింగ్ చేసిన నంద‌మూరి హీరో.. అస‌లు విష‌యాలు భ‌య‌ట‌పెట్టిన ఎఫ్ 3 దర్శ‌కుడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anil Ravipudi : అనీల్ రావిపూడిని ర్యాగింగ్ చేసిన నంద‌మూరి హీరో.. అస‌లు విష‌యాలు భ‌య‌ట‌పెట్టిన ఎఫ్ 3 దర్శ‌కుడు

Anil Ravipudi : రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం అనేది లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్న ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరూ .. ఇలా తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర విజయవంతంగా ఆడాయి. తాజాగా ఈ డైరెక్టర్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఇందులో ఎన్టీఆర్ గురించి ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ‘పటాస్‌ పూర్తయ్యే సమయానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఎక్కువగా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :23 February 2022,7:40 am

Anil Ravipudi : రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం అనేది లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్న ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. పటాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌ 2, సరిలేరు నీకెవ్వరూ .. ఇలా తను చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర విజయవంతంగా ఆడాయి. తాజాగా ఈ డైరెక్టర్‌ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఇందులో ఎన్టీఆర్ గురించి ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ‘పటాస్‌ పూర్తయ్యే సమయానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఎక్కువగా ఆఫీస్‌కు వస్తుండేవారు.

ఆయన నన్ను మామూలుగా ఆడుకునేవారు కాదు.రోజూ ర్యాగింగ్‌ చేసేవారు. ర్యాగింగ్‌ అంటే బాధపెట్టడం కాదు, అల్లరి చేసేవాళ్లు, జోక్‌ చేసేవాళ్లు.నాకు కథ చెప్పవా? అని అడిగేవారు. నా మొదటి సినిమానే ఇంకా రిలీజ్‌ కాదు, ఏం చెప్పాలి అని నేనంటే.. అయితే నాకు కథ చెప్పవా? అని సరదాగా ఆడేసుకునేవాళ్లు. అవి నేను మర్చిపోలేని జ్ఞాపకాలు’ అని ఆనాటి క్షణాలను గుర్తు చేసుకున్నాడు అనిల్‌ రావిపూడి. ప్ర‌స్తుతం ఈయ‌న వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల‌తో క‌లిసి ఎఫ్ 3 అనే చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి.ఎఫ్ 2 సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వస్తోన్న సంగతి తెలిసిందే.

anil ravipudi shares funny Incident with ntr

anil ravipudi shares funny Incident with ntr

Anil Ravipudi : అలా ర్యాగింగ్ చేశాడ‌ట‌…

అనిల్ రావిపూడి ట్రాక్ రికార్డు చూసిన తర్వాత ఇప్పుడు ఎఫ్ 3 సినిమాపై అంచనాలు ఎలా ఉంటాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్. భార్యలు మితిమీరిన ఖర్చులతో చేసిన అప్పులు తట్టుకోలేక.. వెంకటేష్, వరుణ్ తేజ్‌లు కలిసి ఓ హోటల్ పెడతారు. అక్కడ్నుంచి వాళ్లకు ఎదురయ్యే సమస్యలు.. పడే పాట్లేఅనేది ఈ సినిమా కథ అంటున్నారు. అప్పులు తీర్చడానికి పడే తిప్పలు ఫన్నీగా చూపించబోతున్నారట దర్శకుడు అనిల్ రావిపూడి. ఏప్రిల్ 28న సినిమా విడుద‌ల కానున్న‌ట్టు స‌మాచారం.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది