Anjali : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అంజలి తెలుగు అమ్మాయని అందరికి తెలుసు. ఫోటో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రేమలేఖ రాశా అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఈ రెండు సినిమాలు ఫ్లాఫ్ అవడంతో కోలీవుడ్ కి మకాం మార్చింది బ్యూటీ. ఇక అక్కడ షాపింగ్ మాల్, జర్నీ వంటి సినిమాలతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక దీంతో తెలుగులో ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా సక్సెస్ అవడంతో తెలుగులో ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఈమె అడపాదడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక 2014లో ఈమె ప్రధాన పాత్రలో నటించిన గీతాంజలి సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది.
‘ గీతాంజలి మళ్లీ వచ్చింది ‘ అనే టైటిల్ తో ఈ సీక్వెల్ రూపొందనుంది. ఇక ఈ సినిమాకి శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఈవెంట్ లో లేడీ రిపోర్టర్ అడిగిన ప్రశ్నలు అంజలికి చాలా కోపం తెప్పించినట్లుగా కనిపిస్తుంది. మీకు నేను పెద్ద అభిమానిని. మీరు తెలుగమ్మాయి అవడం వల్లే ఇంకా సరైన బ్రేక్ రాలేదు అని ఎప్పుడైనా అనిపించిందా అని రిపోర్టర్ అంజలిని ప్రశ్నించారు. దానికి అంజలి సమాధానమిస్తూ నాకు బ్రేక్ రాకపోతే మీరు నా అభిమాని ఎలా అవుతారు. నేను తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా సినిమాలు చేస్తూనే ఉన్నాను అంటూ సీరియస్ గా సమాధానం ఇచ్చారు.
ఇక అనంతరం శ్రీలీల కూడా తెలుగమ్మాయి మరి ఆమె రేంజ్ లో మీకు సక్సెస్ రాలేదు కదా అంటూ అంజలీని మరింత చికాకు గురి చేశారు. ఇప్పటికీ బిజీగా సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఆ నెంబర్ గేమ్స్ ని నేను పట్టించుకోను. నాకు నచ్చిన పాత్రలు చేస్తాను. తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు సినిమాలలో ప్రతిరోజు ఏదో ఒక సినిమాలో నటిస్తూ ఉంటాను. అలాగే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాను అంటూ ఫైర్ గా సమాధానం ఇచ్చారు . ఆ తర్వాత నా కెరియర్ లో ఫస్ట్ లేడీ ఓరియంటెడ్ మూవీ గీతాంజలి అని, ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆ నమ్మకంతోనే గీతాంజలి మళ్లీ వచ్చింది సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమా చూశాను బాగా వచ్చిందిష సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మరో ఎత్తు అని అంజలి చెప్పుకొచ్చారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.