Anju Kurian : బీచ్ లో సందడి చేస్తున్న మలయాళ కుట్టి అంజు.. పొట్టి డ్రెస్ ఎగిరిపోతుంటే…
Anju Kurian : నటి అంజు కురియన్ తెలుగులో సుమంత్ హీరోగా నటించిన ఇదంజగత్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అలాగే మలయాళం, తమిళ్ సినిమాల్లో కూడా నటించింది. అల్ఫోన్స్ పుత్రేన్ దర్శకత్వం వహించిన నేరం సినిమాలో చిన్న పాత్రలో నటించి మలయాళ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే 2016 మలయాళ సినిమా కవి ఉద్దేషిచతు, న్జన్ ప్రకాశన్, 2019లో తమిళ సినిమా ఇగ్లూలో నటనకు గాను మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అనేక మ్యూజిక్ ఆల్బమ్‌లు మరియు షార్ట్ ఫిల్మ్‌లలో కూడా యాక్ట్ చేసింది.
కొన్ని చిత్రాలతోనే అంజు కురియన్ దృష్టి సారించింది మరియు తన పాత్రల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కాగా కొన్ని యాంగిల్స్‌లో ఆమె జబర్దస్త్ యాంకర్ రష్మిలా ఉందని అభిమానులు అంటుంటారు.చెన్నై టు సింగపూర్ అంజు తొలి తమిళ చిత్రం. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేసింది. ఈ సినిమాపై విమర్శల మాట ఎలా ఉన్నా అంజు కురియన్ గ్లామర్, నటనకు మంచి మార్కులే పడ్డాయి.ఇక ఇదంజగత్ అంజు తొలి తెలుగు చిత్రం. దీనికి ముందు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ భాష సమస్య వల్ల నటించలేదు. ఇదంజగత్ కథ విన్న తర్వాత మాత్రం తప్పనిసరిగా చేయాల్సిందేనని అనుకుందట.
తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టడానికి ఇదొక మంచి అవకాశం అనుకుందట. భాష విషయంలో సుమంత్ సహకరించాడట కూడా. రొటీన్ పాత్రలు కాకుండా భిన్నమైన అనుభూతిని ఇచ్చే పాత్రలు చేయడం తనకు ఇష్టం అని చెబుతోంది ఈ బ్యూటీ. కాగా ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో అభిమానుల ఫాలోయింగ్‌ను భారీగా ఉంది. ఎప్పటికప్పుడు ఫొటో షూట్స్, వీడియోస్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది. తాజాగా అంజు బీచ్ లో సందడి చేస్తున్న వీడియో మతిపొగొడతోంది. పొట్టి డ్రెస్సులో పిచ్చెక్కిస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి..

