Kadambari : ఏపీలో ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు ఎంత ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటి కాదంబరీ జత్వాని కేసు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై ముగ్గురు ఐపీఎస్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వైఎస్ఆర్సీపీ నాయకులు విద్యాసాగర్ కు ముగ్గురు ఐపీఎస్ అధికారులు సహకరించారని బాధితురాలు ఆరోపించారు. దీంతో వారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాధితురాలు చేస్తున్న ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపాయి. ముగ్గురు ఐపీఎస్ అధికారుల్లో ఒకరైన విశాల్ గున్నీకి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ఓ పారిశ్రామికవేత్త తనపై అత్యాచారం చేశారని జత్వానీ బాంద్రా కర్రా కాంప్లెక్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు 2023 డిసెంబర్ 17న ఆ పారిశ్రామికవేత్తపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ఆమె పోలీసులకు సమర్పించాలి. అయితే ఆ సమయంలో ఆమె పోలీసులకు ఆధారాలను సమర్పించలేదు. ఈ ఆధారాలను సమర్పించాల్సిన సమయంలో జత్వానీ విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో అరెస్టై జైల్లో ఉన్నార.ఇదిలా ఉంటే పోలీసు కస్టడీలో ఆమెతో ఐ ఫోన్లను తెరిపించేందుకు పీఎస్సార్ ఆంజనేయుల ఆదేశాల మేరకు కాంతిరాణా, విశాల్ గున్నీ తీవ్రంగా ప్రయత్నించినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ఫోన్లను తెరిచేందుకు కాదంబరి అంగీకరించలేదు. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న కాదంబరి సన్నిహితుడు అమిత్ కుమార్ సింగ్ ను విజయవాడ తీసుకొస్తే.. ఆమె కంగారులో ఫోన్ల లాక్ ఓపెన్ చేస్తుందని కాంతిరాణా, విశాల్ గున్నీలకు కుక్కల విద్యాసాగర్ సలహా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.
తప్పుడు కేసుతో కాదంబరి సన్నిహితుడు అమిత్ కుమార్ ను అరెస్టు చేసేందుకు నలుగురు సభ్యుల పోలీసుల బృందం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ పోలీసు బృందం ఢిల్లీ వెళ్లేందుకు నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న కాంతిరాణా కార్యాలయం నుంచి విమాన టికెట్లు బుక్ చేసినట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఢిల్లీ వెళ్లిన విజయవాడ పోలీసులకు అక్కడ అమిత్ సింగ్ జాడ దొరకలేదని తమ నివేదికలో చెబుతున్నాయి. ఈలోగా కాదంబరి, ఆమె తల్లిదండ్రుల పోలీసు కస్టడీ ముగిసింది. దీంతో ఆమె ఫోన్లను తెరిపించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని టాక్ నడుస్తుంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.