Vakeel saab : వకీల్ సాబ్ .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తెలుగు, తమిళ వెర్షన్స్ కంటే తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు.. తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టు కీలక మార్పులు చేశారని సమాచారం. ఇక ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాశ్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర తర్వాత నివేతా థామస్ క్యారెక్టర్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ .. పోస్టర్స్ వకీల్ సాబ్ సినిమా భారీగా అంచనాలు పెంచాయి. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడం తో నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాడు. కాగా గత ఏడాది మార్చ్ 8న వకీల్ సాబ్ సినిమా నుంచి మగువా మగువా సాంగ్ వచ్చి ట్రెండ్ అయింది.
ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా లిరికల్ సాంగ్ అంటూ ఏదీ రాలేదు. సరిగ్గా ఏడాదికి వకీల్ సాబ్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది. అది కూడా మార్చ్ 8 న. ఈ విషయాన్ని థమన్ ఇప్పటికే హింట్ కూడా ఇచ్చాడు. అయితే ఈ సెకండ్ సింగిల్ ని బట్టి వకీల్ సాబ్ సినిమా మీద అంచనాలు ఎలా పెరుగుతాయో తెలియనుందని అంటున్నారు. కాగా వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. బాలీవుడ్ లో పింక్ గా రూపొంది బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి సూపర్ హిట్ ఇచ్చింది. తమిళంలో అజిత్ కుమార్ కి నేర్కొండ పార్వై గా తెరకెక్కి సూపర్ హిట్ దక్కింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.