Vakeel saab : వకీల్ సాబ్ నుంచి మరో అప్‌డేట్ రాబోతుంది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Vakeel saab : వకీల్ సాబ్ నుంచి మరో అప్‌డేట్ రాబోతుంది..!

Vakeel saab : వకీల్ సాబ్ .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తెలుగు, తమిళ వెర్షన్స్ కంటే తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు.. తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టు కీలక మార్పులు చేశారని సమాచారం. ఇక ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీకపూర్ సమర్పణలో శ్రీ […]

 Authored By govind | The Telugu News | Updated on :16 February 2021,11:35 am

Vakeel saab : వకీల్ సాబ్ .. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. తెలుగు, తమిళ వెర్షన్స్ కంటే తెలుగులో పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు.. తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టు కీలక మార్పులు చేశారని సమాచారం. ఇక ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీకపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించాడు.

another update from vakeel saab

another update from vakeel saab

నివేతా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాశ్ రాజ్, సీనియర్ నరేష్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర తర్వాత నివేతా థామస్ క్యారెక్టర్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ .. పోస్టర్స్ వకీల్ సాబ్ సినిమా భారీగా అంచనాలు పెంచాయి. మూడేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడం తో నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాడు. కాగా గత ఏడాది మార్చ్ 8న వకీల్ సాబ్ సినిమా నుంచి మగువా మగువా సాంగ్ వచ్చి ట్రెండ్ అయింది.

Vakeel saab : వకీల్ సాబ్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది

ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా లిరికల్ సాంగ్ అంటూ ఏదీ రాలేదు. సరిగ్గా ఏడాదికి వకీల్ సాబ్ నుంచి సెకండ్ సింగిల్ రాబోతోంది. అది కూడా మార్చ్ 8 న. ఈ విషయాన్ని థమన్ ఇప్పటికే హింట్ కూడా ఇచ్చాడు. అయితే ఈ సెకండ్ సింగిల్ ని బట్టి వకీల్ సాబ్ సినిమా మీద అంచనాలు ఎలా పెరుగుతాయో తెలియనుందని అంటున్నారు. కాగా వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. బాలీవుడ్ లో పింక్ గా రూపొంది బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి సూపర్ హిట్ ఇచ్చింది. తమిళంలో అజిత్ కుమార్ కి నేర్కొండ పార్వై గా తెరకెక్కి సూపర్ హిట్ దక్కింది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది