Anu Emmanuel : అను ఇమ్మానుయేల్ మొదటిగా నాని సరసన మజ్ను అనే సినిమాతో వెండి తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో అను పర్ఫామెన్స్ చాలా బాగా ఉంటుంది. ఆ కారణం వల్లనే మొదటి సినిమా అంతగా సక్సెస్ అందుకోకపోయినా అను కి మంచి అవకాశాలు లభించాయి. ఇక ఆ తర్వాత అను నటించిన సినిమాలు ఏవి అంత సక్సెస్ ను అందుకోలేదు. యంగ్ హీరో రాజు తరుణ్ తో నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఆక్సిజన్ సినిమా కూడా అంతగా సక్సెస్ ను అందుకోలేదు. ఈ సినిమాలో కూడా అను పర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంది. కాని ఈ సినిమా కూడా డిజాస్టర్ అవడంతో అను కెరియర్ ముగిసినట్లే అనుకున్నారు.
ఆ తర్వాత గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో నటించింది అను . ఈ సినిమాలో కీర్తి సురేష్ ఉన్న అనుకి మంచి రోల్ దొరికిందని చెప్పాలి.పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా అంత సక్సెస్ ను అందుకోలేకపోయింద. ఇక తర్వాత అల్లు అర్జున్తో నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కూడా డిజాస్టర్ గానే మిగిలింది. ఇంకా ఆ తర్వాత అను చేసిన శైలజ రెడ్డి అల్లుడు, మహాసముద్రం, అల్లుడు అదుర్స్, వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అంత సక్సెస్ ను సాధించలేదు. అయితే అను కెరియర్ లో ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా లేకపోవడం విశేషం.
ఇదిలా ఉండగా ఇప్పుడు అల్లు శిరీష్ తో అను ,ఊర్వశివో రాక్షశివో అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సినిమా పై సూపర్ హిట్ టాక్ నడుస్తోంది. ఈ సినిమా అను కెరియర్ ని మలుపు తిప్పబోతుందని అనిపిస్తుంది. అయితే అను ఇమ్మానుయేల్ ఇంతకుముందు ఏ సినిమాలో కూడా అంతగా రొమాన్స్ చేయలేదు. కానీ ఇటీవల విడుదలైన ఊర్వశివో రాక్షశివో సినిమాలో పెదవి ముద్దులతో రెచ్చిపోయింది. అలాగే ఈ సినిమాలో రొమాన్స్ కూడా పిక్స్ లో ఉంటుంది. ఇంతకుముందు చేసిన సినిమాలను దృష్టిలో పెట్టుకొని అను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా అను కెరీర్ ని మలుపు తిప్పుతుందని అందరూ అంటున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.