Home » News » I Will Win More Trophies In The Next 10 Years Hardik Pandya
News

Hardik Pandya : ఆమె నా జీవితంలోకి వచ్చాకే గెలుస్తున్నా .. మరో పదేళ్లు ఏళ్ల క్రికెట్ లక్ష్యం : హార్దిక్ పాండ్యా

Authored By
Suma
The Telugu News | Published on: March 9, 2026, 12:00 pm
Advertisement

Hardik Pandya : టీమిండియా వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన భవిష్యత్ లక్ష్యాలను వెల్లడించాడు. భారత జట్టుకు ఇంకా కనీసం పదేళ్లు సేవ చేయాలని, ఆ కాలంలో మరిన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచి జట్టుకు విజయాలు అందించాలని తాను సంకల్పం చేసినట్లు పేర్కొన్నాడు. ఇప్పటివరకు తన క్రికెట్ ప్రయాణం సగం మాత్రమే పూర్తయిందని, మిగిలిన కాలంలో మరింత పెద్ద విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు హార్దిక్ వెల్లడించాడు.

Advertisement

Hardik Pandya : ఆమె నా జీవితంలోకి వచ్చాకే గెలుస్తున్నా .. మరో పదేళ్లు ఏళ్ల క్రికెట్ లక్ష్యం : హార్దిక్ పాండ్యా

Hardik Pandya : టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా చరిత్రాత్మక విజయం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు న్యూజిలాండ్‌పై 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా స్వదేశంలో ఈ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి జట్టుగా కూడా నిలిచింది. ఇంకా ఒక ప్రత్యేక రికార్డు కూడా భారత్ ఖాతాలో చేరింది. వరుసగా రెండు సార్లు టీ20 వరల్డ్ కప్ టైటిల్‌ను విజయవంతంగా డిఫెండ్ చేసిన తొలి జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. ఈ విజయాల్లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో అతను బ్యాట్‌తో రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేయగా బంతితో తొమ్మిది వికెట్లు తీసి జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించాడు.

Advertisement

Hardik Pandya : ఇంకా పదేళ్లు ఆడాలని హార్దిక్ సంకల్పం

ఫైనల్ మ్యాచ్ అనంతరం హోస్ట్ బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన హార్దిక్ పాండ్యా తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం తాను జట్టులో సీనియర్ ప్లేయర్‌గా ఉండటం సంతోషంగా ఉందని చెప్పాడు. అయితే తన వద్ద ఇంకా పదేళ్ల క్రికెట్ మిగిలి ఉందని స్పష్టం చేశాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో సగం మాత్రమే పూర్తయిందని, మిగిలిన కాలంలో మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు. ఐసీసీ టోర్నమెంట్లు మరియు ఐపీఎల్ కలిపి కనీసం మరో పది ట్రోఫీలు గెలవాలని తన ఆశగా వెల్లడించాడు. నేను ఏ టోర్నమెంట్ ఆడినా గెలవాలనే లక్ష్యంతోనే మైదానంలోకి దిగుతాను. వచ్చే పదేళ్లలో ఐదు లేదా ఆరు ట్రోఫీలు అయినా గెలుస్తాననే నమ్మకం నాకు ఉంది. ఓటమి గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. ఈ విజయానికి దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని హార్దిక్ పేర్కొన్నాడు.

Hardik Pandya : వ్యక్తిగత జీవితంపై హార్దిక్ వ్యాఖ్యలు

ఈ సందర్భంగా హార్దిక్ తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రస్తావించాడు. తన గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ తన జీవితంలో కీలక పాత్ర పోషించిందని వెల్లడించాడు. ఆమె తన జీవితంలోకి వచ్చిన తర్వాత తనకు వరుస విజయాలు దక్కుతున్నాయని తెలిపాడు. మహీకా నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను వరుసగా విజయాలు సాధిస్తున్నాను. నేను చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయం ఇదే. క్రికెట్ ఆడటానికి నా ప్రధాన కారణం ట్రోఫీలు గెలవడం. ఎంత ఎక్కువ ట్రోఫీలు గెలిస్తే అంత సంతోషంగా ఉంటుంది అని హార్దిక్ చెప్పాడు. 2024లోనే తాను ఆడే ప్రతి టోర్నమెంట్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇప్పటికీ అదే నమ్మకం కొనసాగుతుందని అతను పేర్కొన్నాడు. భవిష్యత్తులో భారత జట్టుకు మరిన్ని విజయాలు అందించాలని తన ప్రధాన లక్ష్యమని హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు.

Suma

Author Bio Info : Suma is experienced in Digital Media field. Iam worked in various Telugu media houses for about 10 years. lam worked as a Vaartha DailyNewspaper , Hashtagu, Siri Daily News Paper , MeSpandana .com, Telugu24 .in and present TheTelugunews.com As a News Content Writer, I wrote various articles on Breaking News , Local news live reporting, special stories. Iam is also expert in News Analyzing Contact Details: lathasuma895@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి