Anupama Parameshwaran : పెళ్లి కాకుండానే అనుప‌మ ప్ర‌గ్నెంట్ అయిందా.. వైర‌ల్ అవుతున్న బేబి బంప్ పిక్స్

Authored By Sam C | The Telugu News | Updated on : 31 January 2022, 2:30 pm

Anupama Parameshwaran : అందాల ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాతోను తెగ సంద‌డి చేస్తుంది. హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన తొలి చిత్రం ‘ప్రేమమ్’ ఎంతో మంది కుర్రాళ్ల మనసును కదిపింది అనుపమ పరమేశ్వరన్. అదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ టాలీవుడ్ కు పరిచమైన ఈ భామ ఇప్పటి వరకు అనేక సినిమాలతో దూసుకెళ్తూ.. వెనక్కి తిరిగి చూసుకోలేదు. అనుపమ పరమేశ్వరన్.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన వాటిని పోస్ట్ చేస్తుంది. కొత్తగా అనుపమ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.

ఇందులో బేబి బంప్‌తో క‌నిపించి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది అనుప‌మ‌.2019 ఫ్లాష్ బ్యాక్ విత్ అప్పాజీ అంటూ అనుప‌మ బేబి బంప్‌తో దిగిన ఫొటోలు షేర్ చేయ‌గా, పెళ్లి కాకుండా త‌ల్లి కాబోతుందా అంటూ చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అయితే అస‌లు విష‌యం ఏంటంటే అనుప‌మ త‌న త‌దుప‌రి సినిమా లో ఇలా క‌నిపించ‌నుందంటూ తెలుస్తుంది. ఏదేమైన త‌న లేటెస్ట్ ఫోట‌ల‌తో అనుప‌మ పెద్ద షాకే ఇచ్చింది. అనుప‌మ ఫొటోలు చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యంలో మునిగిపోయారు.అనుపమ పరమేశ్వరన్ రీసెంట్‌గా దిల్ రాజు బ్యానర్‌లో రౌడీ బాయ్స్ సినిమాలోనూ నటించింది.

anupama parameshwaran babybump pics viral

anupama parameshwaran babybump pics viral

ఈ సినిమాతో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి పరిచయం అయ్యాడు. ఈ సినిమాను శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఈ సినిమా కోసం లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది అనుపమ. ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన అనుపమ.. మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్ గా మారింది . రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ సీన్స్క‌నిపించడం అందరికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp