Anushka Sharma : తల్లైనా ఏ మాత్రం తగ్గట్టే.. బికినీలో అనుష్క అందాలు
Anushka Sharma : బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఇప్పుడు కాస్త సోషల్ మీడియాకు దూరంగా ఉంటోంది. విరాట్ కోహ్లీ మాత్రం తన పనులతో బిజీగా ఉంటున్నాడు. క్రికెట్ మ్యాచులతో విరాట్ బిజీగా ఉంటే..తమ గారాల పట్టి వమికను చూసుకుంటూ అనుష్క శర్మ బిజీగా ఉంటోంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలతో పాటు వమికాకు కూడా మంచి క్రేజ్ వచ్చింది. స్టార్ కిడ్స్‌కు నెట్టింట్లో ఉండో ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం స్టార్ కిడ్స్‌పై నోరు పారేసుకుంటారు.
పిల్లలు అని కూడా చూడకుండా దారుణంగా తిడుతుంటారు. ఈ మధ్య విరాట్ కోహ్లీ కూతురి మీద ఓ ఆకతాయి చేసిన బెదిరింపుల గురించి అందరికీ తెలిసిందే. అలా విరాట్ కూతురిపై వచ్చిన ఆరోపణలు దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. అయితే వమికాను ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రదర్శించరు. ఆమెను ఈప్రపంచానికి దూరంగా పెంచుతుంటారు. తాజాగా అనుష్క శర్మ మాత్రం ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. పెళ్లై, తల్లైనా కూడా ఇంకా ఏ మాత్రం తగ్గలేదు.

Anushka Sharma Latest Pics Goes Viral
Anushka Sharma : అనుష్క అందాల జాతర..
తగ్గేదే లే అంటూ అందాలను ఆరబోసింది. బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. స్మిమ్మింగ్ పూల్‌లో అనుష్క కనిపించింది. నవ్వులు చిందిస్తూ కనిపించింది. విరాట్ కోహ్లీ ఈ ఫోటోలకు కామెంట్ చేశాడు. లవ్ సింబల్ ఎమోజీని షేర్ చేశాడు. నవ్వుతున్న ఎమోజీని కూడా షేర్ చేశాడు. మొత్తానికి అనుష్క బికినీ ఫోటోలు నెట్టింట్లో మామూలుగా సందడి చేయడం లేదు. చాలా రోజుల తరువాత ఇలా కనిపించడంతో లైకుల మోత మోగిపోతోంది. కాస్త ఘాటు ఫోటోలను షేర్ చేస్తూ వచ్చిన అనుష్క.. ఇప్పుడు ఇలా బికినీలో దర్శనమిచ్చేసింది.