Home » Entertainment » Anushka Shetty Fires On Netizens For Prabhas
Entertainment

Anushka Shetty – Prabhas : ట్రూ లవ్ అంటే ఇదే.. ప్రభాస్ కోసం అనుష్క శెట్టి ఏం చేసిందో చూడండి !

Authored By
aruna
The Telugu News | Published on: July 1, 2023, 3:08 pm
Advertisement

Anushka Shetty – Prabhas : టాలీవుడ్ లో ప్రభాస్ అనుష్కలకు ఉన్న క్రేజ్ అంతా కాదు. ఇద్దరు నిజంగానే పెళ్లి చేసుకుంటే ఎంత బాగుంటుందో కదా అని అనుకునే అభిమానులు కూడా ఉన్నారు. కానీ ప్రభాస్ అనుష్క మాత్రం మా మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది అని చాలా సార్లు చెప్పుకొచ్చారు. అయినా సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ అనుష్కల మధ్య ఉన్న ప్రేమ గురించి విషయం బయటకు వచ్చింది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఇటీవల ‘ ఆదిపురుష్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కొంచెం పాజిటివ్ టాక్ ను, కొంచెం నెగిటివ్ టాక్ ను సంపాదించుకుంది.

Advertisement

కానీ సినిమా వసూళ్ల పరంగా అత్యధిక కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికీ ఈ సినిమాపై ట్రోల్లింగ్ జరుగుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా రాముడి పాత్రలో ప్రభాస్ సూట్ అవ్వలేదు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. అయితే ఈ కామెంట్స్ పై అనుష్క ఘాటుగా కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మాట్లాడినంత ఈజీ కాదు రాముడి పాత్రలో కనిపించడం ఆ పాత్రలో ప్రభాస్ చూడ ముచ్చటగా ఉన్నారు. ఎందుకు అందరూ పదే పదే ప్రభాస్ ని ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేసిన వాళ్లు ఒక్కసారి ఆ పాత్రను నటించి చూపిస్తే మీకు ఆ బాధ తెలుస్తుంది అంటూ ఫైర్ అయింది.

Advertisement

దీంతో మరోసారి అనుష్క ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో పరోక్షంగా చెప్పింది. ప్రస్తుతం అనుష్క చేసిన కామెంట్ లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో అనుష్కకి ప్రభాస్ అంటే ఇష్టమని కావాలని వీళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమను బయట పెట్టడం లేదని చెప్పుకొస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కె, రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు. ఇక అనుష్క శెట్టి నవీన్ పోలిశెట్టి నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఎవరు సినిమాలతో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి