Anushka love in senior actor Prabhas
Anushka shetty : టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ప్రభాస్ అనుష్క జంట ఒకటి. వీరిద్దరి సినిమాలు, పెళ్లి విషయాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతుంటాయి. ప్రభాస్ అనుష్కల ప్రేమ, పెళ్లి విషయంలో వార్తలు ట్రోల్ అవుతుంటే..ప్రముఖ జ్యోతిష్యుడు వినోద్ కుమార్ మాత్రం ప్రభాస్ పెళ్లెప్పుడనేది జోస్యం చెప్పేశాడు. రెబెల్‌స్టార్ పుట్టిన తేదీ ప్రకారం..త్వరలో పెళ్లి కానుందని..2022 అక్టోబర్ నుంచి 2023 అక్టోబర్ మధ్యకాలంలో జరగవచ్చని కూడా చెప్పేశాడు. ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసేవాళ్లు కూడా ఉన్నారు. అసలు పెళ్లెప్పుడు, అనుష్కతో పెళ్లి ఉందా లేదా అనేది ప్రభాస్ మాత్రమే స్పష్టం చేయాలి. కాని ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
టాలీవుడ్‌లో కొన్ని పర్ఫెక్ట్ ఆన్ స్క్రీన్ కపుల్స్ ఉన్నాయి. అందులో ఒకటి ప్రభాస్, అనుష్క. స్క్రీన్‌పై వీరి కెమిస్ట్రీ ఏ రేంజ్‌లో వర్కవుట్ అయ్యిందంటే వీరిద్దరు నిజంగానే రియల్ లైఫ్ కపుల్స్ అయితే బాగుండు అని ప్రేక్షకులు ఇప్పటికీ భావిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క.. ప్రభాస్‌తో మరోసారి రీ ఎంట్రీ ఇవ్వనుందట. ప్రభాస్.. అనుష్క సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండగే. వీరిద్దరు కలిసి నటించిన మిర్చీ, బాహుబలి సినిమాలు సూపర్ డూపర్ అయ్యాయి. అయితే మరోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కానుంది. ప్రముఖ డైరెక్టర్ మారుతితో కలిసి కొత్త సినిమా చేయడానికి ప్రభాస్ సంతకం పెట్టాడు.
anushka shetty in love with prabhas
రాజా డీలక్స్ అనే టైటిల్ తో ఈ హారర్-కామెడీ చిత్రం తెరకెక్కనుంది. 2013లో విడుదలైన ప్రేమ కథా చిత్రమ్ సినిమాకు మారుతి నిర్మాతగా పనిచేశారు. అయితే డార్లింగ్ ప్రభాస్ ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లతో రోమాన్స్ చేయనున్నాడు. అనుష్కతో పాటు మాళవిక మోహనన్, శ్రీలీల కూడా రాజా డీలక్స్‌లో కనిపించనున్నారు. . అయితే ఇందులో మెయిన్ హీరోయిన్‌గా అనుష్కను సెలక్ట్ చేసిందట మూవీ టీమ్. ఒకవేళ ప్రభాస్, అనుష్క మరోసారి కలిసి నటిస్తే అక్కడే సినిమా సగం సూపర్ హిట్ అని భావిస్తున్నారు అభిమానులు. అంటే ప్రభాస్‌తో మరోసారి అనుష్క రొమాన్స్ చేయనుందనే సరికి
అభిమానుల ఆనందం హద్దులు దాటుతుంది.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.