Home » Entertainment » Anushka Shetty Naga Chaitanya Engagement Viral News
Entertainment

Anushka Shetty : అనుష్కతో నాగచైతన్య ఎంజేజ్‌మెంట్ .. నాగార్జున రియాక్షన్ ఇదే..

Authored By
mallesh
The Telugu News | Published on: November 19, 2021, 10:27 am
Advertisement

Anushka Shetty : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, సమంత వివాహ బంధం నుంచి విడిపోయిన సంగతి అందరికీ విదితమే. డైవోర్స్ తర్వాత సమంత, నాగచైతన్య ఇద్దరూ వారి ప్రొఫెషనల్ సినిమా కెరీర్స్‌పై కాన్సంట్రేట్ చేశారు. ఎవరి సినిమాలు వారు చేసుకుంటున్నారు. కాగా, సమంత, నాగచైతన్య విడిపోకుండా ఉండాల్సిందని చాలా మంది అనుకున్నారు. కానీ, ఎట్టకేలకు వారు విడిపోయారు. అయితే, విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో చేసే పోస్టులు బాగా చర్చనీయాంశమవుతున్నాయి.సమంతతో డైవోర్స్ తర్వాత నాగచైతన్య సోషల్ మీడియాకు కొంత దూరంగానే ఉంటున్నాడు. తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ మాత్రమే ఇస్తున్నాడు.

Advertisement

Anushka Shetty : ఆ వార్త వెంటనే నాగార్జున వరకు చేరగానే వెంటనే వారికి ఫోన్..

anushka shetty naga chaitanya engagement Viral news

వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల జోలికి వెళ్లడం లేదు. కాగా, తాజాగా నాగచైతన్య గురించి మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది. అయితే, ఆ వార్త ఇప్పటిది కాదండోయ్… గతంలో వైరల్ అయిన వార్తనేనట. ఆ న్యూస్ ప్రకారం.. నాగచైతన్య, అనుష్కశెట్టిలకు ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది. ఆ టైంలో నాగచైతన్య స్విట్జర్లాండ్‌లో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు.ఆ విషయం నాగార్జునకు తెలిసిన వెంటనే నెక్ట్స్ డే మార్నింగ్ నాగ్.. చైతన్యకు ఫోన్ చేశాడు. అనుష్కకు, నీకు ఎంగేజ్‌మెంట్ జరిగిందట..నాకు చెప్పనేలేదు అని నాగచైతన్యను నాగార్జున మందలించాడట.

Advertisement

అయితే, నాగార్జున మాటలకు నాగచైతన్య గట్టిగా నవ్వుతూ ‘వాహ్.. నిజమేనాన్న..’ అని అన్నాడట. అలా నాగచైతన్యపై వచ్చిన రూమర్స్‌ను నాగార్జున, నాగచైతన్య ఎంజాయ్ చేశారు. ఈ విషయం స్వీటీ అనుష్కశెట్టికి చెప్పగా, ఆమె కూడా బాగా నవ్వుకుందట. అనుష్కశెట్టి పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘సూపర్’ ఫిల్మ్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత వరుస సినీ అవకాశాలు ఈమెకు రాగా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది ఈ భామ. ‘సూపర్’ సినిమాలో అక్కినేని నాగార్జున హీరోగా నటించాడు. నాగార్జున, నాగచైతన్య ప్రస్తుతం ‘బంగార్రాజు’ మూవీలో నటిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి