Anushka shetty Green signal to make film under UV banner
Anushka shetty : అనుష్క టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరోయిన్. పూరి జగన్నాధ్ – నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం స్టార్ ఇమేజ్ ని సొంత చేసుకుంది. ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు అవుతోంది. ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. మేకర్స్ కి బంగారం లాంటి హీరోయిన్. హీరోలు కూడా అనుష్క హీరోయిన్ గా చేస్తుందంటే ఫుల్ హ్యాపీ. ఇక దర్శకులందరికీ స్వీటీ. ప్రయోగాలు చేయడంలో అనుష్క ముందుంటుంది. తనకోసమే కథ రెడీ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.
Anushka shetty Green signal to make film under UV banner
కాని ప్రస్తుతం అనుష్క రేస్ లో లేదు. ఇప్పుడున్న హీరోయిన్స్ తో పోల్చుకుంటే ఎక్కడో ఉంది. కొన్ని ప్రయోగాలు వికటించడంతో అనుష్క కెరీర్ డైలమాలో పడింది. ఇక గత చిత్రం నిశ్శబ్ధం కూడా ఫ్లాపయి అనుష్క కెరీర్ మీద గట్టి ప్రభావమే చూపించింది. ఈ సినిమా తర్వాత అనుష్క ఏ ప్రాజెక్ట్ ని కమిటవలేదు. ఒకవైపు అనుష్క ఫ్యాన్స్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ మధ్య అనుష్క తమిళంలో ఒక సినిమా చేయబోతుందని వార్తలు వచ్చాయి. అలాగే తెలుగులో ఒక సినిమా ప్రకటించబోతుందని వార్తలు వచ్చాయి.
కాని అవన్ని పుకార్లని తర్వాత తేలిపోయింది. అయితే రీసెంట్ గా అనుష్క తో ఒక సినిమా నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రెడీ అయ్యారని సమాచారం. ఇప్పటికే అనుష్క ఈ బ్యానర్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. కాని ఎందుకనో యూవీ మేకర్స్ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం లేదు. ఇంకా అనుష్క డేట్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ సినిమా లేక హీరో ఉంటాడా అన్నది సస్పెన్స్ గా ఉంది. కాగా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ముఖ్య పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. ఇక అనుష్క కోసం కోలీవుడ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.