Anushka shetty : అనుష్క కమిటయినా వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Anushka shetty : అనుష్క కమిటయినా వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు..?

Anushka shetty : అనుష్క టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరోయిన్. పూరి జగన్నాధ్ – నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం స్టార్ ఇమేజ్ ని సొంత చేసుకుంది. ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు అవుతోంది. ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. మేకర్స్ కి బంగారం లాంటి హీరోయిన్. హీరోలు కూడా అనుష్క హీరోయిన్ గా చేస్తుందంటే ఫుల్ […]

 Authored By govind | The Telugu News | Updated on :20 February 2021,10:42 am

Anushka shetty : అనుష్క టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ హీరోయిన్. పూరి జగన్నాధ్ – నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం స్టార్ ఇమేజ్ ని సొంత చేసుకుంది. ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్ళు అవుతోంది. ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. మేకర్స్ కి బంగారం లాంటి హీరోయిన్. హీరోలు కూడా అనుష్క హీరోయిన్ గా చేస్తుందంటే ఫుల్ హ్యాపీ. ఇక దర్శకులందరికీ స్వీటీ. ప్రయోగాలు చేయడంలో అనుష్క ముందుంటుంది. తనకోసమే కథ రెడీ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.

Anushka shetty Green signal to make film under UV banner

Anushka shetty Green signal to make film under UV banner

కాని ప్రస్తుతం అనుష్క రేస్ లో లేదు. ఇప్పుడున్న హీరోయిన్స్ తో పోల్చుకుంటే ఎక్కడో ఉంది. కొన్ని ప్రయోగాలు వికటించడంతో అనుష్క కెరీర్ డైలమాలో పడింది. ఇక గత చిత్రం నిశ్శబ్ధం కూడా ఫ్లాపయి అనుష్క కెరీర్ మీద గట్టి ప్రభావమే చూపించింది. ఈ సినిమా తర్వాత అనుష్క ఏ ప్రాజెక్ట్ ని కమిటవలేదు. ఒకవైపు అనుష్క ఫ్యాన్స్ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ మధ్య అనుష్క తమిళంలో ఒక సినిమా చేయబోతుందని వార్తలు వచ్చాయి. అలాగే తెలుగులో ఒక సినిమా ప్రకటించబోతుందని వార్తలు వచ్చాయి.

Anushka shetty : అనుష్క ఈ బ్యానర్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట.

కాని అవన్ని పుకార్లని తర్వాత తేలిపోయింది. అయితే రీసెంట్ గా అనుష్క తో ఒక సినిమా నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రెడీ అయ్యారని సమాచారం. ఇప్పటికే అనుష్క ఈ బ్యానర్ లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందట. కాని ఎందుకనో యూవీ మేకర్స్ ప్రాజెక్ట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయడం లేదు. ఇంకా అనుష్క డేట్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. మరి ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ సినిమా లేక హీరో ఉంటాడా అన్నది సస్పెన్స్ గా ఉంది. కాగా ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ముఖ్య పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేస్తారో. ఇక అనుష్క కోసం కోలీవుడ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది