AR Rahman : ఇటీవల ప్రముఖులు విడాకులు ప్రకటించడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ మూడు దశాబ్దాల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నారు. రెహమాన్ భార్య సైరా తన భర్త నుంచి విడిపోతున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఆమె తరపు లాయర్ వందనా షా అధికారిక ప్రకటన విడుదల చేశారు. 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి రెహమాన్ నుంచి తాను విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం ఇద్దరి మధ్య వచ్చిన కలహాలు అని.. ఒకరిపై మరొకరికి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ.. తమ మధ్య ఏర్పడిన ఇబ్బందులను అధిగమించలేని అంతరాన్ని సృష్టించాయని లాయర్ వందనా షా పేర్కొన్నారు. అభిప్రాయబేధాల కారణంగానే ఇద్దరి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా తమ విడాకుల విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ స్పందించారు. ఏఆర్ రెహమాన్ కూడా విడాకులపై స్పందించారు. తమ వివాహ బంధం త్వరలోనే 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని భావించామని, కానీ అనూహ్య రీతిలో ముగింపు పలకాల్సి వచ్చిందని అన్నారు. పగిలిన హృదయాలు దైవాన్ని కూడా ప్రభావితం చేస్తాయని, తిరిగి యథాతథంగా అతుక్కోలేవని రెహమాన్ వ్యాఖ్యానించారు.
కఠిన పరిస్థితుల్లో తమ వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నామంటూ ఎక్స్ వేదికగా ఆయన ప్రకటన విడుదల చేశారు. కాగా రెహమాన్ దంపతులు 1995లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 29 ఏళ్లు కలిసి జీవించారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు ఖతీజా, రహీమా, అమీన్. పెళ్లైన దాదాపు మూప్పై ఏళ్ల తర్వాత విడాకులు తీసుకోవడానికి భావోద్వేగపూరితమైన గాయమని సైరా బాను తరపు లాయర్ ప్రకటించారు.
Sobhita Dhulipala : అక్కినేని నాగ చైతన్య naga chaitanya ఈమధ్యనే హీరోయిన్ శోభిత దూళిపాళని Sobhita Dhulipala పెళ్లాడిన…
Naga Chaitanya : అక్కినేని ఫ్యామిలీ నాగ చైతన్య, అఖిల్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఐతే నాగ…
Karthika Deepam Vantalakka : కార్తీక దీపం సీరియల్ ఫాలో Karthika Deepam అయ్యే వారికి వంటలక్క గురించి ప్రత్యేకంగా…
RTC Free Bus Scheme : Telangana తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం Congress Govt కొలువుదీరాక మహిళలకి ఫ్రీ బస్…
Taxpayers : పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ ఎలా తగ్గించుకోవాలా అని అనేక ప్రయత్నాలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం.అయితే వచ్చే…
Anil Ravipudi Father : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో Sankranthiki…
Women : తెలంగాణ ప్రభుత్వం Telangana Govt ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్నిabhaya hastam scheme అమలు చేసేందుకు రెడీ…
Betel Leaves Benefits : తమలపాకు ని ఇప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరు పెంచుకుంటూ వస్తున్నారు. దీని ఇంటి అలంకరణ…
This website uses cookies.