
Viral Video : ఆరేళ్ల కిందట తప్పిపోయిన తండ్రి.. కూతుళ్లు అనాధాశ్రమంలో చూసి కంట కన్నీరు ఆగలే..!
Viral Video : కొన్ని సంఘటనలు ప్రతి ఒక్కరికి కంట కన్నీరు పెట్టిస్తుంటాయి. చాలా ఏళ్ల తర్వాత పిల్లలని కలవడం చూసిన ఆ తండ్రి భావోద్వేగానికి గురి కావడం లేదంటే తప్పిన పోయిన పిల్లలని చూసి తండ్రి కన్నీరు పెట్టుకోవడం వంటివి ఎన్నో జరిగాయి.తాజాగా జరిగిన ఓ సంఘటన అందరికి కంట కన్నీళ్లు పెట్టించింది.
హైదరాబాద్ లోని మాతృదేవోభవ అనాధాశ్రమంలో ఎంతో మంది అనాధలు ఆశ్రయం పొందుతున్నారు. వీరి సంఖ్య సుమారు 130 వరకూ ఉంటుందని చెబుతున్నారు. ఈ క్రమంలో సుమారు ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో బాలయ్య అనే వ్యక్తి తిరుగుతుంటే… అతడిని ఈ ఆశ్రయం నిర్వాహకులు చేరదీసి ఆశ్రయం కల్పించారు.
ఆరేళ్లుగా బాలయ్య అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో.. బాలయ్య కూతురు దివ్య.. నెల రోజుల కిందట ఆ ఆశ్రమంలో ఉన్నవారికి అన్నదానం చేయడానికి వచ్చింది. అప్పుడు ఆశ్రమం నిర్వాహకులతో.. తమ కన్నతండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడు అని చెప్పింది. తాజాగా మళ్లీ దివ్య అదే అశ్రమానికి అన్నదానం చేయడానికి వచ్చింది. అప్పుడు ఊహించని ఘటన జరిగింది. కన్నతండ్రిని గుర్తుపట్టి బాలయ్య కూతురు బాగోద్వేగానికి గురయ్యారు. తండ్రిని హత్తుకొని ఏడ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ తండ్రి దొరికినందుకు సంతోషంగా ఉందని దివ్య చెబుతున్నారు.
Viral Video : ఆరేళ్ల కిందట తప్పిపోయిన తండ్రి.. కూతుళ్లు అనాధాశ్రమంలో చూసి కంట కన్నీరు ఆగలే..!
తమ తండ్రిని ఇంటికి తీసుకెళ్తామని ఆశ్రమ నిర్వాహకులను ఇద్దరు కూతుళ్లు అడిగారు. అయితే… ఈ సందర్భంగా కొన్ని కండిషన్స్ పెట్టిన వారు.. బాలయ్యను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో ఇది చూసి చాలా మంది తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు! ఇలాంటి కూతుళ్లు ఉంటే చాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.తమ వెంట ఉన్నపుడు తండ్రి విలువ తెలియదని.. తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాలని బాలయ్య కూతుళ్లు కోరుతున్నారు. ఇన్నాళ్లు తమ తండ్రికి ఆశ్రయం ఇచ్చిన మాతృదేవోభవ అనాధ ఆశ్రమం నిర్వాహకులకు కృతజ్ఞతలు చెప్పారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.