Hyper Aadi : ఆదిలో ఈ మార్పుకి కారణం ఏంటి.. సడెన్‌గా రోజా భజన చేస్తున్నాడు..!
Hyper Aadi : జబర్థస్త్ షోతో లైమ్ లైట్‌లోకి వచ్చిన చాలా మంది ఆర్టిస్టులలో హైపర్ ఆది ఒకరు. తనదైనశైలిలో పంచులు వేస్తూ అతి తక్కువ కాలంలోనే ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది తరువాత టీం లీడర్‌గా ఎదిగాడు. తన స్కిట్‌లను తానే రాసుకొంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. హైపర్‌నే తన ఇంటి పేరు మార్చుకున్న ఆది..తనదైన పంచ్ డైలాగులతో రెచ్చిపోతుంటాడు. తన స్కిట్స్‌లో అమ్మాయిలను చులకనగా చూపించడం, వారిపై డబుల్ మీనింగ్ డైలాగులు వాడటం వంటివి చేస్తుంటాడు. దీంతో ఆది విమర్శలకు గట్టి పని కల్పిస్తుంటాడు.
ఇదిలా ఉంటే హైపర్ ఆది మెగా అభిమాని అనే అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు హైపర్ ఆది వీరాభిమాని. అవకాశం చిక్కినప్పుడల్లా పవన్‌పై తనకున్న అభిమానాన్ని చూపిస్తుంటాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరుఫున ఆయన విసృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సమయంలో జబర్దస్త్ షో జడ్జ్ రోజాపై కూడా హైపర్ ఆది విమర్శలు చేయడం జరిగింది. ఎన్నికల్లో జనసేన గెలవడంతో పాటు, మంత్రిగా పోటీ చేసిన రోజా సైతం ఓడిపోయారు. రోజాకు పొలిటికల్‌గా జరిగిన డ్యామేజ్ కన్నా కూడా జబర్దస్త్ షోలో కమెడియన్స్ చేసిన డ్యామేజ్ ఎక్కువ అని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై హైపర్ ఆది రియాక్ట్ అయ్యాడు. జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన ‘కేశవ చంద్ర రమావత్’ అనే సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ఆదితో పాటు రోజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.చాలా రోజుల తర్వాత రోజా గారిని ఇలా వేదికపై కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. బేసిక్ గా కొన్ని యూట్యూబ్ ఛానల్ వారు వారి ఛానల్ వ్యూస్ కోసం హైపర్ ఆది రోజా గారి గురించి ఏమన్నారు తెలుసా అంటూ హెడ్డింగులు పెట్టేస్తూ వార్తలు రాస్తుంటారు.
Hyper Aadi : ఆదిలో ఈ మార్పుకి కారణం ఏంటి.. సడెన్‌గా రోజా భజన చేస్తున్నాడు..!
నేను ఇదివరకు ఎప్పుడు కూడా రోజా గారి గురించి ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇక ఆమె గురించి ఎక్కడ చెడుగా మాట్లాడను కూడా అంటూ ఆది తెలిపారు. ఇక యూట్యూబ్ ఛానల్ వారు వారి వ్యూస్ కోసం ఏదో ఒకటి రాయాలి కాబట్టి రాస్తుంటారని అది తెలిపారు. ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా మంచిగా ఉందని త్వరలోనే పుష్ప సినిమా రాబోతుందని ఈ సినిమా ద్వారా మరికొన్ని రికార్డులు సృష్టించబోతున్నారని తెలిపారు.తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడం, ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్లు సినిమాలు, పవన్ కళ్యాణ్ వంద శాతం స్ట్రయిక్ రేట్ తో పొలిటికల్ గా గెలవడంతో టాలీవుడ్ ఇప్పుడు చాలా బాగా ఉందని హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.