Home » Entertainment » Ariyana Warning To Anchor Shiva In Bigg Boss Ott Telugu
Entertainment

Bigg Boss OTT Telugu : ముద్దిస్తావా అని అరియానాను అడిగిన యాంకర్ శివ.. ఆ మాట‌కు అరియాన ఏం అందంటే..?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Updated on: March 6, 2022 1:32 pm
Advertisement

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు అప్పుడే వారం పూర్తి చేసుకుంది. హౌస్ లోని వారియర్స్, చాలెంజర్స్ సభ్యులు బాగానే కలిసిపోయారు. అందరి మధ్య ఇప్పుడిప్పుడే ఒక బాండ్ ఏర్పడుతోంది. ఇప్పటికే కొన్ని ప్రేమ జంటలు కూడా బయటికి వచ్చాయి. హౌస్ మొత్తం ఒక బాండ్ ఏర్పడింది. అయితే.. కొందరితో కొందరికి అస్సలు పడటం లేదు. శతృత్వం కూడా ఏర్పడింది. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో గ్రూపులు కూడా అప్పుడే ఏర్పడ్డాయి. ఇక.. ప్రేక్షకుల కోసం కావాల్సిన ఎంటర్ టైన్ మెంట్ ఫుల్ గా దొరుకుతోంది ప్రేక్షకులకు. బిగ్ బాస్ కు కావాల్సింది కూడా అదే కదా.

Advertisement

ariyana warning to anchor shiva in bigg boss ott telugu

కంటెస్టెంట్ల మధ్య పుల్లలు పెడుతూ.. బిగ్ బాస్ కూడా ఆనందం పొందుతున్నాడు. వాళ్లు గొడవలు పడుతుంటే ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. మరోవైపు యాంకర్ శివ అయితే.. హౌస్ లోనే బెస్ట్ ఫ్లర్టింగ్ గయ్ గా పేరు తెచ్చుకున్నాడు.ముందు బిందుపై పడ్డాడు. ఆ తర్వాత హమీదాను ట్రై చేశాడు. ఇప్పుడు అరియానా వెంట పడుతున్నాడు. బిందు డైరెక్ట్ గా చెప్పేసింది. నాకు ట్రై చేసుకోకు.. వేస్ట్. నువ్వు ఎంత ట్రై చేసినా పడను అని డైరెక్ట్ గా చెప్పింది. దీంతో బిందును వదిలేశాడు శివ.

Advertisement

ఆ తర్వాత హమీదా వెంట పడగా.. హమీదా కూడా అదే స్టయిల్ లో జవాబు చెప్పింది. నిజానికి.. హమీదా.. ఆర్జే చైతూ వెంట తిరుగుతోంది. దీంతో ఇక లాభం లేదనుకొని అరియానా వెంట పడుతున్నాడు యాంకర్ శివ.

Bigg Boss OTT Telugu : పనిష్ మెంట్ ఇవ్వు అంటే.. ముద్దు అడిగిన శివ

ఉదయమే అందరూ పాటకు డ్యాన్స్ వేసిన తర్వాత కసరత్తులు ప్రారంభించారు. అప్పుడే యాంకర్ శివ, అరియానా ఒక చోట కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. నా బ్యాడ్జ్ ఏది అని అడుగుతుంది అరియానా. దీంతో ముమైత్ దగ్గర ఉంది తీసుకోలేదా అని అంటాడు యాంకర్ శివ.దీంతో అది నాది కాదు అంటుంది అరియానా. నాకు తెలుసు అంటాడు శివ. నీదగ్గరే ఉందని నాకు తెలుసు అంటుంది అరియానా. పనిష్ మెంట్ ఇచ్చి ఇస్తా అంటాడు శివ. సరే.. అది ఇవ్వు నేను పనిష్ మెంట్ తీసుకుంటా అంటుంది అరియానా.

Advertisement

దీంతో దీని మీద కూర్చొని చేయి పట్టుకొని నాకు ముద్దు పెట్టాలి అంటాడు. దీంతో తల పగిలిపోద్ది అంటుంది అరియానా. పెట్టాలి. ఇది పనిష్ మెంట్ చేయాలి అంటాడు యాంకర్ శివ. కావాలంటే నువ్వు అడుగు.. పనిష్ మెంట్ ఇవ్వు.. ముద్దులు పెడతా అంటాడు యాంకర్ శివ.దీంతో ఒళ్లంతా నీకు తిమ్మిరిగా ఉన్నట్టుంది అంటుంది అరియానా. నేను తమ్ముళ్లకు ముద్దు పెట్టను అంటూ యాంకర్ శివను తమ్ముడిని చేసేసింది అరియానా. దీంతో శివ ఇంకేం మాట్లాడలేదు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి