
Tragic incident at engineering college
Medak : మెదక్ జిల్లాలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న విద్యార్థినిపై అదే కాలేజీకి చెందిన విద్యార్థి లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాక ఆ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి కూడా అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో నిజాంపేట్ శ్రీనివాస్ నగర్‌కు చెందిన ఓ విద్యార్థిని ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న ఆశిష్ అనే విద్యార్థి ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. 2024 సంవత్సరం నుంచి ప్రేమ పేరుతో ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
Medak : ఇంజినీరింగ్ కళాశాలలో దారుణం .. విద్యార్థినిపై లైంగిక దాడి
గత సంవత్సరం కాలేజీ ప్రాంగణంలోనే మత్తు కలిపిన చాక్లెట్ ఇచ్చి ఆమెపై లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఆ ఘటన తరువాత కూడా పలుమార్లు దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆశిష్ తన స్నేహితుడు, అదే కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి ప్రవీణ్‌ను బాధితురాలికి పరిచయం చేశాడు. అనంతరం ప్రవీణ్ కూడా ఆమెను లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా కాలేజీ యాజమాన్యానికి ఈ ఘటనపై ముందుగానే సమాచారం ఉన్నట్లు తెలిసింది. అప్పట్లోనే ఆశిష్ తల్లిదండ్రులను పిలిపించి డిక్లరేషన్ రాయించుకున్నట్లు సమాచారం. అయితే ఈ చర్యల తర్వాత కూడా ఘటనలు కొనసాగడం పలు ప్రశ్నలకు దారితీస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.
Peddi Movie 1st Day Box Office : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ Ram Charan నటించిన ప్రతిష్టాత్మక…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan తెలంగాణ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు…
Peddi Movie Review : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు…
Boduppal : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం…
Telangana Formation Day : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో…
Kolan Hanmanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఘనంగా…
Mandumula Parameshwar Reddy : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.…
Vijayasai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహిళా రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల టీడీపీ జాతీయ…
Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార తెలుగు దేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల…
MLC Malka Komaraiah : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, వేతనాలు, పెండింగ్ సమస్యలు మరియు…
Pension : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
This website uses cookies.