Bigg Boss 9: బిగ్‌బాస్ 9 లోకి ఆ పాప..ఇక హౌస్ లో రచ్చ రచ్చే
Asha Saini in Bigg Boss 9 : బిగ్‌బాస్ అభిమానులు ఎదురుచూస్తున్న సీజన్ 9 అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి షోలో ఎన్నో కొత్త విషయాలు ఉండబోతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ‘లక్స్ పాప’గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఆశా షైని అలియాస్ ఫ్లోరా షైని ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తున్నారని సమాచారం. ఆమెతో పాటు, సోషల్ మీడియాలో లీకైన జాబితా ప్రకారం.. తేజస్విని గౌడ, కల్పిక గణేష్, ఇమ్మాన్యుయేల్, సుమంత్ అశ్విన్ వంటి పలువురు నటులు, యూట్యూబర్లు, సింగర్లు, ఇతర ప్రముఖులు కూడా ఈ సీజన్‌లో పాల్గొనబోతున్నారు. ఈ లీకైన జాబితా నిజమైతే, ఈసారి సీజన్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పవచ్చు.

Asha Saini in Bigg Boss 9
ఈ సీజన్‌కు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈసారి కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా, సాధారణ ప్రజలు (కామనర్స్) కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి రాబోతున్నారు. దీనికోసం ఇప్పటికే ‘బిగ్‌బాస్ అగ్ని అరీక్ష’ పేరుతో ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. అభిజీత్, బిందు మాధవి, నవదీప్ వంటి మాజీ కంటెస్టెంట్లు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ఎంపికైన 4-5 మంది సామాన్యులు సెలబ్రిటీలతో కలిసి బిగ్‌బాస్ హౌస్‌లో ఉండబోతున్నారు. ఇది షోకు సరికొత్త అనుభవాన్ని తీసుకువస్తుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు.
సెప్టెంబర్ 7న కింగ్ నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ జరగనుంది. ఈ సీజన్ లో పెద్ద ట్విస్ట్‌లు, కొత్త రూల్స్ ఉంటాయని టాక్. అందులో ఒక పెద్ద ట్విస్ట్ ఏమిటంటే, షో ప్రారంభమైన మూడు రోజులకే మొదటి ఎలిమినేషన్ ఉండబోతోంది. ఇది కంటెస్టెంట్స్‌కు మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు కూడా షాక్ ఇస్తుందని చెప్పవచ్చు. ఎలాంటి వార్మప్ పీరియడ్ లేకుండానే నేరుగా ఎలిమినేషన్ రౌండ్‌లోకి వెళ్లనున్నారు. ఈసారి సీజన్ అన్ని రకాల ఎమోషన్స్‌తో కూడిన ఒక ఎక్స్‌ప్లోసివ్ మిక్స్‌లా ఉండబోతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.