Samantha : స్విస్‌లో సమంత.. వెంకటేష్ కూతురి రియాక్షన్ వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samantha : స్విస్‌లో సమంత.. వెంకటేష్ కూతురి రియాక్షన్ వైరల్

Samantha : సమంత ఏ పని చేసినా, ఏ పోస్ట్ చేసినా కూడా జైకొట్టేందుకు వెంకీ మామ కూతురు రెడీగా ఉంటుంది. సమంత పోస్ట్ చేయడం ఆలస్యం.. వెంకటేష్ కూతురు మాత్రం వెంటనే కామెంట్ చేస్తుంటుంది. ఆశ్రిత దగ్గుబాటి విదేశాల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె పోస్ట్‌లన్నీ కూడా ఫుడ్‌కు సంబంధించినవే అయి ఉంటాయి. రకరకాల ఫుడ్‌ను ఆమె ట్రై చేస్తుంటుంది. అయితే సమంత అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా.. దగ్గుబాటి వారికి మాత్రం ఇంకా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :21 January 2022,6:00 pm

Samantha : సమంత ఏ పని చేసినా, ఏ పోస్ట్ చేసినా కూడా జైకొట్టేందుకు వెంకీ మామ కూతురు రెడీగా ఉంటుంది. సమంత పోస్ట్ చేయడం ఆలస్యం.. వెంకటేష్ కూతురు మాత్రం వెంటనే కామెంట్ చేస్తుంటుంది. ఆశ్రిత దగ్గుబాటి విదేశాల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆమె పోస్ట్‌లన్నీ కూడా ఫుడ్‌కు సంబంధించినవే అయి ఉంటాయి. రకరకాల ఫుడ్‌ను ఆమె ట్రై చేస్తుంటుంది.

అయితే సమంత అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉన్నా కూడా.. దగ్గుబాటి వారికి మాత్రం ఇంకా దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తోంది. రానా, మిహీకా, ఆశ్రిత దగ్గుబాటి (వెంకటేష్ కూతురు) ఇలా అందరితో ఇంకా టచ్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. వీరితో సమంత మాట్లాడుతున్నట్టుంది. అందుకే సమంత పోస్ట్‌లకు వీరు రియాక్ట్ అవుతుంటారు. ఆశ్రిత అయితే తప్పకుండా కామెంట్ చేస్తుంది.

Ashritha Daggubati On Samantha At Verbier Switzerland

Ashritha Daggubati On Samantha At Verbier Switzerland

Samantha : సమంతపై ఆశ్రిత దగ్గుబాటి కామెంట్

తాజాగా సమంత స్విస్‌లో తేలింది. స్విట్జర్లాండ్‌లో గడ్డ కట్టే చలిలో ఏదో విన్యాసాలు చేస్తోన్నట్టు కనిపిస్తోంది. దీనిపై సమంత స్నేహితురాళ్లు స్పందించారు. ఇక చిన్మయి అయితే ఏకంగా బంగారు పతాకాన్ని తీసుకు రాగల సత్తా ఉందంటూ కామెంట్ చేసింది. ఇలా కొత్తగా ట్రై చేస్తున్నావా? పాప అంటూ నీరజ కోన రియాక్ట్ అయింది. ఫుల్ సరదాగా ఉంది కదా? అంటూ వెంకీ మామ కూతురు ఆశ్రిత కామెంట్ చేసింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది