Home » Entertainment » Asin That Star Hero Helped For Asin Marriage With Rahul Sharma
Entertainment

Asin : రాహుల్ శర్మతో ఆసిన్ మ్యారేజ్‌కు హెల్ప్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా?

Authored By
mallesh
The Telugu News | Updated on: December 21, 2021 4:13 pm
Advertisement

Asin : బ్యూటిఫుల్ హీరోయిన్ ఆసిన్ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా ‘అమ్మా నాన్నా..ఓ తమిళ అమ్మాయి’ అని చెప్పొచ్చు. ఈ ఫిల్మ్‌లో ఆసిన్ యాక్టింగ్ చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈ భామ నిజానికి మలయాళి కుట్టీ. కానీ,తెలుగు ప్రేక్షకులకు తమిళ్ అమ్మాయిగా పరిచయమైంది. ఇక హీరోయిన్‌గా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్న ఆసిన్.. మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను మ్యారేజ్ చేసుకుంది. వీరి పెళ్లికి ఓ స్టార్ హీరో హెల్ప్ చేశాడు ఆయన ఎవరంటే..ఆసిన్ దాదాపుగా స్టార్ హీరోలందరి సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.

Advertisement

నరేంద్రన్ మకన్ జయకాంతన్ వక’ అనే మలయాళ పిక్చర్‌తో ఈ భామ సిల్వర్ స్క్రీన్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అమ్మ..నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలో తెలుగు ఇండస్ట్రీలోకి డెబ్యూ అయింది. వెర్సటైల్ యాక్టర్ సూర్య ‘గజినీ’ సినిమాతో ఈమె పాపులారిటీ ఇంకా పెరిగింది. ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆసిన్ బహుభాషావేత్త అని చెప్పొచ్చు..ఆసిన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు భాషలు అనర్గళంగా మాట్టాడగలదండోయ్.. తెలుగు, మలయాళం, తమిళ్, హిందీ, కన్నడ, ఇంగ్లిష్, మరాఠీ, పంజాబీ, ఫ్రెంచ్‌, గుజరాతి, భాషలు మాట్లాడగలదు.

asin that star hero helped for asin marriage with rahul sharma

Advertisement

Asin : ఆసిన్ బహుభాషావేత్త.. అన్ని భాషలు మాట్లాడగలదండోయ్..

అయితే, ఆసిన్ రెమ్యునరేషన్ విషయంలో అస్సలు వెనక్కు తగ్గకపోయేదని అప్పట్లో టాక్. తను సినీ కెరీర్‌లో చాలా బిజీగా ఉన్న టైంలోనే ఆసిన్ రాహుల్‌ శర్మను మ్యారేజ్ చేసుకుంది. 2016లో వీరి వివాహం జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వల్లే వీరి మ్యారేజ్ జరిగిందండోయ్. అక్షయ్, రాహుల్ ఫ్రెండ్స్. కాగా, అక్షయ్ మూవీలో హీరోయిన్‌గా చేసిన అసిన్‌కు ఓ ఫంక్షన్లో రాహుల్‌తో పరిచయం అయింది. అలా ఆ పరిచయం కాస్త వివాహ బంధం వరకు వెళ్లింది.
కాగా, వీరి పెళ్లి విషయంలో అక్షయ్ కమారే హెల్ప్ చేశాడు. ఆసిన్-రాహుల్ జంటకు అరిన్ జన్మించింది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి