Glimpse Of Narappa : అసురన్ వర్సెస్ నారప్ప .. వెంకీ మెప్పిస్తాడా ..?

 Authored By govind | The Telugu News | Updated on :13 December 2020,8:19 am

ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించాలన్న …వినోదాన్ని పంచాలన్న టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకీ కే అది సాధ్యమైన పని. సెలబ్రిటీ హోదా తో సినీరంగంలోకి అడుగుపెట్టినా తన టాలెంట్ తో తానేంటో నిరూపించుకుని అసాధారణమైన అభిమానాన్ని సాంతం చేసుకున్నారు వెంకటేష్. ఇండస్ట్రీకి హీరోగా వచ్చిన అతి కొద్ది కాలంలోనే విక్టరీ ఇమేజ్ ని సాధించాడు. రీమేక్ మూవీస్ తో హిట్లు కొట్టి రీమేక్ మూవీస్ కి కింగ్ అనిపించుకున్నాడు. ఎఫ్ 2 మూవీ తో సూపర్ ఫన్ ని అందించిన వెంకీ…ఈ సినిమా తర్వాత వెంకీ మామ తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

F2 Fun and Frustration Review - tollywood

లేటెస్ట్ గా తమిళ సూపర్ హిట్ రీమేక్ మూవీలో నటిస్తున్నారు వెంకటేష్. తమిళంలో సూపర్ హిట్ అందుకున్న అసురన్ సినిమాకు రీమేక్ గా నారప్ప సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సురేష్ బాబు, కలైపులి నిర్మాతలు గా వ్యవహరించనున్నారు. గతంలో ఎన్నడూ చూడనటువంటి గెటప్ లో వెంకీ నారప్ప లో కనిపించనున్నారు. విక్టరీ వెంకటేష్ 60 ఏళ్ల పుట్టినరోజు సందర్భంగా తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసింది.

Victory Venkatesh's NARAPPA First Look Teaser | Venkatesh Upcoming Movie Narappa First Look - YouTube

గతంలో కనిపించని గెటప్ లో వెంకటేష్ కనిపించి ప్రేక్షకులను అలరించారు . ఎలాంటి డైలాగులు లేకుండా మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో రిలీజ్ అయిన ఈ టీజర్ ను చూసిన వారంతా వెంకటేష్ యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. నారాప్ప గెటప్ లో వెంకీ అదిరిపోయారు.. అంటూ అభిమానులు సంబరపడుతున్నారు.

కాగా ఈ సినిమాలో నారప్పకు జోడీగా సుందరమ్మగా ప్రియమణి కనిపించనుంది. అయితే ఇప్పటివరకు ఫ్యామిలీ, ఫన్ సినిమాలతో ఆడియన్స్ మెప్పించిన వెంకటేష్ ఈ సినిమా తో ఎలాంటి సక్సస్ ను అందుకుంటాడో చూడాలి. అయితే ఈ టీజర్ రిలీజయ్యాక కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. టీజర్ నే మక్కి కి మక్కీగా దింపారంటే ఇక సినిమా కూడా ఇలాగే ఉంటుందేమో అని మాట్లాడుకుంటున్నారట.

govind

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి