Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ పరాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!
Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. విడుదలైన మొదటి రోజునుంచి విమర్శలు, నెగిటివ్ టాక్‌తో సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించినప్పటికీ, తను సాధారణంగా పెట్టే హిట్ మార్క్‌ను అందుకోలేకపోయాడు.
Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ పరాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!
‘తమ్ముడు’ స్క్రిప్ట్‌ను తొలుత నానికి వినిపించాడట దర్శకుడు. కథలో బలమైన అంశాలు లేవని భావించిన నాని, తెలివిగా ఈ కథను తిరస్కరించాడు. అనంతరం వేణు శ్రీరామ్ అదే కథను నితిన్‌కు వినిపించగా, ఆయన ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం నితిన్‌కు చుక్కలు చూపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇక్కడే ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్! నితిన్ తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’ కూడా నాని తిరస్కరించిన కథే అని టాలీవుడ్ వర్గాల సమాచారం.
ఈ సినిమాకు ‘బలగం’ ఫేం వేణు ఎల్లగండల దర్శకత్వం వహించనున్నాడు. నిర్మాత మళ్లీ దిల్ రాజు కావడం గమనార్హం. ఒకేసారి రెండు కథలు నాని తిరస్కరించగా, అవే కథలతో నితిన్ సినిమాలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది.ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు ఇప్పుడు నితిన్ కథల ఎంపికపై ప్రశ్నలు వేస్తున్నారు. వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న నితిన్, ఈ సమయంలో బలమైన స్క్రిప్ట్ సెలక్షన్ అవసరం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో, నాని కథల ఎంపిక విషయంలో ఉన్న మెచ్యూరిటీ మరోసారి హైలైట్ అవుతోంది.
Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…
Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్‌పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
This website uses cookies.