Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. విడుదలైన మొదటి రోజునుంచి విమర్శలు, నెగిటివ్ టాక్‌తో సినిమాకు ఎదురుదెబ్బ తగిలింది. దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించినప్పటికీ, తను సాధారణంగా పెట్టే హిట్ మార్క్‌ను అందుకోలేకపోయాడు.

Nithin నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు తమ్ముడు తర్వాత ఎల్లమ్మపై సందేహాలు

Nithin : నాని తిరస్కరించిన కథలతో నితిన్ ప‌రాజయాలు.. ‘తమ్ముడు’ తర్వాత ‘ఎల్లమ్మ’పై సందేహాలు..!

Nithin : నానిపై న‌మ్మ‌కం..

‘తమ్ముడు’ స్క్రిప్ట్‌ను తొలుత నానికి వినిపించాడట ద‌ర్శ‌కుడు. కథలో బలమైన అంశాలు లేవని భావించిన నాని, తెలివిగా ఈ కథను తిరస్కరించాడు. అనంతరం వేణు శ్రీరామ్ అదే కథను నితిన్‌కు వినిపించగా, ఆయన ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం నితిన్‌కు చుక్కలు చూపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఇక్కడే ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్! నితిన్ తదుపరి చిత్రం ‘ఎల్లమ్మ’ కూడా నాని తిరస్కరించిన కథే అని టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ సినిమాకు ‘బలగం’ ఫేం వేణు ఎల్లగండల దర్శకత్వం వహించనున్నాడు. నిర్మాత మళ్లీ దిల్ రాజు కావడం గమనార్హం. ఒకేసారి రెండు కథలు నాని తిరస్కరించగా, అవే కథలతో నితిన్ సినిమాలు చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమవుతోంది.ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు ఇప్పుడు నితిన్ కథల ఎంపికపై ప్రశ్నలు వేస్తున్నారు. వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న నితిన్, ఈ సమయంలో బలమైన స్క్రిప్ట్ సెలక్షన్ అవసరం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో, నాని కథల ఎంపిక విషయంలో ఉన్న మెచ్యూరిటీ మరోసారి హైలైట్ అవుతోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది