Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ ఆటలు, ఎలిమినేషన్స్, టాస్క్‌లు అన్నీ కూడా షోపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఎలిమినేషన్స్ ఊహించని విధంగా సాగుతుండడంతో ప్రేక్షకులలో ఆసక్తి మరింత ఎక్కువైంది.గత వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. తాజాగా మెహబూబ్ ఇంటిని వీడాడు. నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. మెహబూబ్ ఎలిమినేషన్ గంగవ్వను తీవ్ర నిరాశకు గురి చేసింది. మెహబూబ్ వేదికపైకి వెళ్లి మాట్లాడుతుంటే గంగవ్వ కన్నీటి పర్యంతం అయ్యింది. గంగవ్వకు నేను ఎప్పుడూ అండగా ఉంటానని మెహబూబ్ హామీ ఇచ్చాడు.
నీకు ఏది కావాలన్నా, ఎలాంటి అవసరం వచ్చినా నన్ను అడగమని గంగవ్వతో మెహబూబ్ అన్నాడు. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పై తన అభిప్రాయం తెలియజేసి మెహబూబ్ బిగ్ బాస్ వేదికను వీడాడు. బిగ్‌బాస్ సండే ఎపిసోడ్ ముగిసిన తర్వాత ప్రోమోను చూపించారు. ఈ ప్రోమోలో కడుపు నొప్పేస్తుంది, వెళ్లిపోతానని అవినాష్ చెబుతూ కనిపించాడు. ఆవినాష్ కడుపునొప్పితో బాధపడుతోన్నట్లు తెలుస్తోంది. ట్రీట్‌మెంట్ కోసం అతడు బయట అడుగుపెట్టనున్నట్లు చెబుతోన్నారు. ట్రీట్‌మెంట్ పూర్తయిన తర్వాత తిరిగి హౌజ్‌లో అడుగుపెట్టాడా? లేదంటే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడా అన్నది ఆసక్తికరంగా మారింది. కడుపులో సమస్య ఉంది. నువ్వు బయటకు వెళ్లి మంచి వైద్యుడికి చూపించుకోవడం మంచిదని డాక్టర్స్ సూచించారు. అందుకే నేను వెళ్లిపోతున్నా.. అన్నాడు అవినాష్.
నిజమా అని నయని పావని తనపై ఒట్టు వేయించుకుంది. అవునని అవినాష్ చెప్పడంతో తోటి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా టేస్టీ తేజ, విష్ణుప్రియ, రోహిణి, నయని పావని ఆవేదన చెందారు. విష్ణుప్రియ, రోహిణి బాగా ఏడ్చేశారు. ఈ వారం ఎలిమినేషన్ అయిన మెహబూబ్ ..వరస్ట్ కంటెస్టెంట్ అని అవినాష్‌ను అవమానించినందుకు అతడికి సారీ చెప్పాడు. హౌజ్‌మేట్స్‌కు క్రాకర్స్‌లో ఎవరికి ఏ ట్యాగ్ ఇస్తారో చెప్పమని మెహబూబ్‌ను అడిగాడు నాగార్జున. థౌజండ్‌వాడా ట్యాగ్ అవినాష్‌కు ఇచ్చాడు. హౌజ్‌లో అవినాష్ కామెడీ బాగుంటుందని అన్నాడు.తారాజువ్వ ట్యాగ్‌ను నబీల్‌కు ఇచ్చాడు. కాకరవత్తి గా రోహిణి, అగ్గిపెట్టెగా…గౌతమ్‌లకు ట్యాగ్‌లకు ఇచ్చాడు మెహబూబ్. బిగ్‌బాస్ సీజన్ 4లో దీపావళి రోజే మెహబూబ్ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆ విషయాన్ని బిగ్‌బాస్ స్టేజ్‌పై గుర్తుచేసుకున్నాడు. లాస్ట్ లైమ్ దీపావళికి నా ఎలిమినేషన్ అయ్యింది. ఈ సారి దీపావళికే అయ్యింది అని మెహబూబ్ చెప్పాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.