Bigg Boss 8 Telugu : ప్రోమోతో టెన్ష‌న్ పెంచిన బిగ్ బాస్ నిర్వాహ‌కులు.. అవినాష్‌ని మ‌ధ్య‌లోనే పంపించేస్తున్నారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 8 Telugu : ప్రోమోతో టెన్ష‌న్ పెంచిన బిగ్ బాస్ నిర్వాహ‌కులు.. అవినాష్‌ని మ‌ధ్య‌లోనే పంపించేస్తున్నారా..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 October 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : ప్రోమోతో టెన్ష‌న్ పెంచిన బిగ్ బాస్ నిర్వాహ‌కులు.. అవినాష్‌ని మ‌ధ్య‌లోనే పంపించేస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. కంటెస్టెంట్స్ ఆట‌లు, ఎలిమినేష‌న్స్, టాస్క్‌లు అన్నీ కూడా షోపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. ఎలిమినేష‌న్స్ ఊహించ‌ని విధంగా సాగుతుండ‌డంతో ప్రేక్ష‌కులలో ఆస‌క్తి మ‌రింత ఎక్కువైంది.గ‌త వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. తాజాగా మెహబూబ్ ఇంటిని వీడాడు. నామినేషన్స్ లో ఉన్న ఆరుగురిలో అతి తక్కువ ఓట్లు తెచ్చుకున్న మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. మెహబూబ్ ఎలిమినేషన్ గంగవ్వను తీవ్ర నిరాశకు గురి చేసింది. మెహబూబ్ వేదికపైకి వెళ్లి మాట్లాడుతుంటే గంగవ్వ కన్నీటి పర్యంతం అయ్యింది. గంగవ్వకు నేను ఎప్పుడూ అండగా ఉంటానని మెహబూబ్ హామీ ఇచ్చాడు.

Bigg Boss 8 Telugu ఊహించని ఎలిమినేష‌న్..

నీకు ఏది కావాలన్నా, ఎలాంటి అవసరం వచ్చినా నన్ను అడగమని గంగవ్వతో మెహబూబ్ అన్నాడు. ఇక హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ పై తన అభిప్రాయం తెలియజేసి మెహబూబ్ బిగ్ బాస్ వేదికను వీడాడు. బిగ్‌బాస్ సండే ఎపిసోడ్‌ ముగిసిన త‌ర్వాత ప్రోమోను చూపించారు. ఈ ప్రోమోలో క‌డుపు నొప్పేస్తుంది, వెళ్లిపోతాన‌ని అవినాష్‌ చెబుతూ క‌నిపించాడు. ఆవినాష్ క‌డుపునొప్పితో బాధ‌ప‌డుతోన్న‌ట్లు తెలుస్తోంది. ట్రీట్‌మెంట్ కోసం అత‌డు బ‌య‌ట అడుగుపెట్ట‌నున్న‌ట్లు చెబుతోన్నారు. ట్రీట్‌మెంట్ పూర్త‌యిన త‌ర్వాత తిరిగి హౌజ్‌లో అడుగుపెట్టాడా? లేదంటే హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యాడా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. కడుపులో సమస్య ఉంది. నువ్వు బయటకు వెళ్లి మంచి వైద్యుడికి చూపించుకోవడం మంచిదని డాక్టర్స్ సూచించారు. అందుకే నేను వెళ్లిపోతున్నా.. అన్నాడు అవినాష్‌.

Bigg Boss 8 Telugu ప్రోమోతో టెన్ష‌న్ పెంచిన బిగ్ బాస్ నిర్వాహ‌కులు అవినాష్‌ని మ‌ధ్య‌లోనే పంపించేస్తున్నారా

Bigg Boss 8 Telugu : ప్రోమోతో టెన్ష‌న్ పెంచిన బిగ్ బాస్ నిర్వాహ‌కులు.. అవినాష్‌ని మ‌ధ్య‌లోనే పంపించేస్తున్నారా..!

నిజమా అని నయని పావని తనపై ఒట్టు వేయించుకుంది. అవునని అవినాష్ చెప్పడంతో తోటి కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా టేస్టీ తేజ, విష్ణుప్రియ, రోహిణి, నయని పావని ఆవేదన చెందారు. విష్ణుప్రియ, రోహిణి బాగా ఏడ్చేశారు. ఈ వారం ఎలిమినేష‌న్ అయిన మెహ‌బూబ్ ..వ‌ర‌స్ట్ కంటెస్టెంట్ అని అవినాష్‌ను అవ‌మానించినందుకు అత‌డికి సారీ చెప్పాడు. హౌజ్‌మేట్స్‌కు క్రాక‌ర్స్‌లో ఎవ‌రికి ఏ ట్యాగ్ ఇస్తారో చెప్ప‌మ‌ని మెహ‌బూబ్‌ను అడిగాడు నాగార్జున‌. థౌజండ్‌వాడా ట్యాగ్ అవినాష్‌కు ఇచ్చాడు. హౌజ్‌లో అవినాష్ కామెడీ బాగుంటుంద‌ని అన్నాడు.తారాజువ్వ ట్యాగ్‌ను న‌బీల్‌కు ఇచ్చాడు. కాక‌ర‌వ‌త్తి గా రోహిణి, అగ్గిపెట్టెగా…గౌత‌మ్‌ల‌కు ట్యాగ్‌ల‌కు ఇచ్చాడు మెహ‌బూబ్‌. బిగ్‌బాస్ సీజ‌న్ 4లో దీపావ‌ళి రోజే మెహ‌బూబ్ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆ విష‌యాన్ని బిగ్‌బాస్ స్టేజ్‌పై గుర్తుచేసుకున్నాడు. లాస్ట్ లైమ్ దీపావ‌ళికి నా ఎలిమినేష‌న్ అయ్యింది. ఈ సారి దీపావ‌ళికే అయ్యింది అని మెహ‌బూబ్ చెప్పాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది