Avinash Is Away With Ariyana About RGV Issue
Avinash-Ariyana : అరియానా అవినాష్‌లు బిగ్ బాస్ షో నుంచి మంచి స్నేహితులుగా మారారు. బిగ్ బాస్ ఆట ముగిసినా కూడా వీరి బంధం ముగియలేదు. ఇంకాస్త దగ్గరయ్యారు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. అయితే అరియానా వ్యవహారం అందరికీ తెలిసిందే. ఏదైనా సలహాలు ఇచ్చినా, చెప్పినా పట్టించుకోదు. నీకెందుకు? నా లైఫ్ నా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతుంది. అలానే అవినాష్‌ను కూడా అనేసిందిట. దీంతో ఈ ఇద్దరి మధ్య మాటలు లేవని తెలుస్తోంది. దాదాపు రెండు మూడు నెలలు మాట్లాడకుండా దూరంగానే ఉన్నారట.
Avinash Is Away With Ariyana About RGV Issue
తాజాగా ఈ విషయాలన్నీ వారిద్దరే చెప్పారు. కామెడీ స్టార్స్ షోలో చాలా గ్యాప్ తరువాత అవినాష్ స్కిట్‌లో అరియానా చేసింది. ఇన్ని రోజులు మాట్లాడుకోలేదని, తాను ఎంత ప్రయత్నించినా అవినాష్ మాట్లాడలేదని అరియానా చెప్పుకొచ్చింది. మంచి చెబితే.. ఆ దారిలో నడవకు అని చెబితే.. నీకెందుకు అని అరియానా అంది.. అందుకే దూరంగా ఉండిపోయాను అని అవినాష్ చెప్పుకొచ్చాడు .అయితే ఈ ఇద్దరి మధ్య దూరం పెరగడానికి గల కారణాన్ని అవినాష్ తన స్కిట్ రూపంలో చెప్పకనే చెప్పేశాడు.
Avinash Is Away With Ariyana About RGV Issue
వర్మతో అరియానా చేసిన చెత్త ఇంటర్వ్యూ అవినాష్‌కు నచ్చలేదేమో. దాన్ని స్ఫూప్‌గా చేస్తూ అరియానా మీద కోపం తీర్చుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ చేసినందుకు ఎంత కోపం ఉందో అవినాష్ చూపించాడు. అయితే వర్మతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా అరియానాను అందరూ ఏకిపారేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమె మీద విపరీతమైన నెగెటివిటీ పెరిగింది. అదే విషయాన్ని అవినాష్ చెబితే.. అరియానా అర్థం చేసుకోనట్టుంది. మొత్తానికి అరియానా అవినాష్ మధ్య అలా వర్మ చిచ్చు పెట్టినట్టు అయింది.
Avinash Is Away With Ariyana About RGV Issue
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.