Home » Entertainment » Avinash Romance With Divi And Priyanka Singh In Bigg Boss Kings Vs Queen Event
Entertainment

Avinash : రెచ్చిపోయిన అవినాష్.. స్టేజ్ మీద బిగ్ బాస్ బ్యూటీలతో రొమాన్స్

Authored By
aruna
The Telugu News | Updated on: July 23, 2022 4:53 pm
Advertisement

Avinash : తెరపై అవినాష్ చేసే అతి గురించి అందరికీ తెలిసిందే. అవినాష్ చేసేది కామెడీ అని తనలో తాను భ్రమిస్తుంటాడు. అది కామెడీ కాదు.. వెగటు కామెడీ అని అవినాష్‌కు తెలియడం లేదు. బిగ్ బాస్ ఇంట్లో ఉండగా తనకు తాను ఎంటర్టైనర్ అని ప్రకటించుకున్నాడు. అలా స్వయం ప్రకటిత కమెడియన్ అయిపోయాడు. అయితే అవినాష్‌లో కామెడీ యాంగిల్ ఉంది. కానీ అది ఒక్కోసారి హద్దులు దాటుతుంది. బుల్లితెరపై ఇప్పుడు స్టార్ మాలో ఏ ఈవెంట్ చేసినా కూడా అందులో అవినాష్ కనిపిస్తుంటాడు.

Advertisement

తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో కలిసి స్టార్ మా కింగ్స్ క్వీన్స్ అనే ఈవెంట్ చేశారు. ఇందులో అవినాష్ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ బ్యూటీలైన దివి, ప్రియాంక సింగ్‌లతో రెచ్చిపోయాడు.నువ్ నిజంగా క్వీన్ అయితే.. నీకు దమ్ముంటే.. నన్ను హగ్ చేసుకో అని అవినాష్ సవాల్ విసురుతాడు. అవినాష్‌ చాలెంజ్‌కు ప్రియాంక రెచ్చిపోతుంది. అవినాష్‌ను తన కౌగిలిలో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. చిన్న పిల్లాడిని వదిలెయ్.. దడుసుకున్నట్టున్నాడు అని అందరూ అంటారు. కానీ అవినాష్ మాత్రం.. బాగుందన్నా అంటూ ఇంకా కావాలన్నట్టుగా చూస్తాడు.

Avinash Romance With Divi And Priyanka Singh in Bigg Boss Kings Vs Queen Event

Advertisement

ఇక ఇంకో సందర్భంలో దివిని కోరుకుంటాడు. మీరు నిజంగా క్వీన్స్ అయితే నాకు దివిని ఇచ్చేయండని అంటాడు. ఏం లేదు.. డ్యాన్స్ పర్ఫామెన్స్ చేద్దామని అడుగుతున్నాను అని కవర్ చేస్తాడు. ఆ తరువాత దివితో కలిసి రొమాంటిక్ స్టెప్పులు వేస్తాడు. ఇక మరో వైపు దివి అయితే సీసా అంటూ ఐటం సాంగ్‌కు స్టెప్పులు వేస్తుంది. ఇంకో సందర్భంలో అవినాష్ మరింత ముందుకు వెళ్తాడు. మీరు నిజంగా క్వీన్స్ అయితే.. అందరూ నాకు ముద్దులు పెట్టండి అని కోరుకుంటాడు.

అలా అవినాష్ ప్రతీ సందర్భంగా అతిని ప్రదర్శిస్తుంటాడు. అవినాష్ చేసిందే కామెడీ అని స్టార్ మా అనుకుంటూ ఉంటోంది కాబోలు. ఇక ఈ ప్రోమోలో మాత్రం దివి, సిరి, భాను వేసిన రొమాంటిక్ స్టెప్పులు అదిరిపోయాయి. చివర్లో రవి, సన్నీ గొడవ ఏంటన్నది చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి