Baba Bhasker Satires on SUma In Star Maa Bonalu Event
Baba Bhasker : స్టార్ మా చేసే స్పెషల్ ఈవెంట్లు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటాయి. అయితే ఈ సారి బోనాల మీద కాన్సెప్ట్ తీసుకున్నారు. స్టార్ మా ఇస్మార్ట్ బోనాలు అనే ఈవెంట్‌ను నిర్వహించబోతోన్నారు. ఇందులో సుమ సందడి చేసింది. ఇక సీరియల్ తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరూ కలిసి ఈ ఈవెంట్ టాప్ లేపేశారు. అందులో మరీ ముఖ్యంగా బాబా భాస్కర్, అవినాష్ వంటి వారు నానా హంగామా చేసేశారు. ఈ ప్రోమోలో సీరియల్ తారలను అవినాష్ ఆడుకున్నాడు. సుమను అవినాష్, బాబా భాస్కర్ ఆడేసుకున్నారు. ఇక ఈ ఈవెంట్‌లోనే పరంపర సీజన్ 2 ప్రమోషన్స్ కూడా కానిచ్చేశారు. ఇందులో భాగంగా ఆకాంక్ష సింగ్, నవీన్ చంద్రలు వచ్చారు.
ఈ అమ్మాయిని నేను ఎంతో ప్రేమించాను అని నవీన్ చంద్ర అంటాడు. కానీ వేలు మాత్రం సుమ వైపు చూపిస్తారు. దీంతో సుమ తెగ సిగ్గుపడిపోయినట్టు చూపిస్తారు. సారీ ఈ అమ్మాయి ఆమె అని ఆకాంక్ష సింగ్ వైపు చూపిస్తాడు నవీన్ చంద్ర. ఆమె అమ్మాయి కాదు అవ్వ అని బ్యాక్ గ్రౌండ్‌లో బాబా భాస్కర్ అరిచేస్తాడు. అలా సుమను ఆడుకుంటూ ఉంటాడు బాబా భాస్కర్. ఇక ఎన్నో సందర్భాల్లో బాబా భాస్కర్ మీద సుమ కౌంటర్లు వేసింది. మా ఊర్లో ఓ సమస్య ఉంది అని బాబా భాస్కర్ అనడంతో.. నువ్వే పెద్ద సమస్య కదా?అని సుమ కౌంటర్లు వేస్తుంది.
Baba Bhasker Satires on SUma In Star Maa Bonalu Event
ఇంట్లో బోళ్లు తోముకుంటూ ఉన్నట్టుగా జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్‌ను చూపించారు. ఇలాంటివి చేసేటప్పుడు సుమ బాగానే నవ్వుతుందన్నట్టుగా బాబా భాస్కర్ కౌంటర్ వేస్తాడు. దీంతో సుమ కూడా సెటైర్లు వేసింది. నువ్ బిగ్ బాస్ ఇంట్లో ఏం చేశావో మాకు తెలుసు. నువ్ లోపల కడిగావ్.. బయటకు వచ్చాక మీ ఆవిడ నిన్ను కడిగేసింది అని కౌంటర్లు వేసింది. అలా మొత్తానికి సుమ, బాబా భాస్కర్ కాంబో మాత్రం ఈ ఈవెంట్లో హైలెట్ అయ్యేలా ఉంది. జానకి కలగనలేదు టీం చేసిన డ్యాన్స్ పర్ఫామెన్స్ అదిరిపోయింది. అవినాష్, బాబా భాస్కర్‌ల టైమింగ్ అదిరిపోయింది. ఇక ఈ ఈవెంట్‌లో సుధీర్ మాత్రం కనిపించలేదు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.