That's how far Jabardasth friction goes
Jabardasth : బుల్లితెరపై సాదాసీదా ఎంటర్‌టైన్‌మెంట్ సాగుతున్న సమయంలో ఈటీవీ జబర్ధస్త్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అప్పుడే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే కమెడీయన్స్‌తో జబర్ధస్త్ షో మొదలు పెట్టగా, ఈ కార్యక్రమం ప్రేక్షక్షకులకి మంచి వినోదం పంచింది. ఈ క్రమంలో గురువారం మాత్రమే ప్రసారం అయ్యే ఈ షో శుక్రవారం ఎక్స్‌ట్రా జబర్ధస్త్ అంటూ సరికొత్త వినోదం అందించేందుకు వచ్చింది. రాను రాను ఈ రెండు షోలకు మంచి ఆదరణ దక్కడంతో ఎంతో మంది కమెడీయన్స్ కూడా లైమ్ లైట్‌లోకి వచ్చారు. సినిమాల్లో కూడా ఆఫర్స్ దక్కించుకున్నారు. కాని కొందరు అనివార్య కారణాల వలన బయటకు వెళ్లి ఇప్పుడు జబర్ధస్త్‌పై సంచలన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదం చాలా రచ్చగా మారుతుంది. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.
జబర్దస్త్ మీద ఆ ప్రోగ్రాం నిర్మించిన నిర్మాణ సంస్థ మల్లెమాల పైన అలాగే నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి పైన జబర్దస్త్ లో ఒకప్పటి కంటెస్టెంట్ గా ఉన్న కిరాక్ ఆర్పీ పలు సంచలన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. మల్లెమాలలో భోజనం మొదలు అనేక విషయాల మీద ఆయన అనేక ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇప్పుడు ఒక్కరొక్కరిగా జబర్దస్త్ తరఫున మాట్లాడుతూ అనేక విషయాలు వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆర్పీ చేసిన కామెంట్స్‌ని శేషు,రామ్ ప్రసాద్, హైపర్ ఆది వారు ఖండించగా, తాజాగా ఒకప్పటి జబర్ధస్త్ మేనేజర్ ఏడుకొండలు ఫ్రేమ్‌లోకి వచ్చాడు. ఆయన ఎంట్రీతో వివాదం మరింత రంజుగా మారింది. ఆయన ఆర్పీ వ్యాఖ్యలను ఖండిస్తూనే సుధీర్, గెటప్ శ్రీనులపై సంచలన కామెంట్స్ చేశాడు. ఒక సినిమా డబ్బింగ్ కోసం ఆర్పీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి వెళ్లడంతో ఆర్పీ అక్కడ తనను చూసి తన సినిమాకు మేనేజర్ గా ఉండమని కోరాడని తన జీతం 30 వేలు అయితే తనకు 50, 000 ఇస్తేనే సినిమా చేస్తానని అన్నానని ఆ 50, 000 ఇవ్వడానికి కూడా ఆర్పీ సిద్ధమయ్యాడని అన్నారు.
That’s how far Jabardasth friction goes
ఆఫీస్ కి వెళ్లడం ప్రారంభించిన తర్వాత అతను చేస్తున్న ఫ్రాడ్ వ్యవహారాలన్నీ తెలుసని చెప్పుకొచ్చారు. ముందు సినిమాలో ఎవరో నటీనటులు అని అడిగితే ప్రభాస్ గారి కజిన్ ఒకాయన ఉన్నారని ప్రస్తుతం కొంచెం హెవీ బాడీ ఉంది మరి కొన్నాళ్లలో తగ్గితే మనం సినిమా మొదలు పెట్టొచ్చు అని అనేవాడని అన్నారు. ఏవో మాయ మాటలు చెప్పి చాలా మందిని ఆర్పీ మోసం చేశాడని ఏడు కొండలు అన్నారు. ఇక .సుడిగాలి సుధీర్ సినిమాలతో బిజీగా ఉన్నానని చెబుతున్నా సుధీర్ నటించిన ఒక్క సినిమా కూడా ఆడలేదని ఏడుకొండలు కామెంట్లు చేశారు..నేను కల్మషం లేకుండా పని చేసుకుంటున్నానని అందువల్లే సంతోషంగా ఉన్నానని ఏడుకొండలు చెప్పుకొచ్చారు. సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు మోసం చేస్తున్నారని అందుకే వాళ్లకు సక్సెస్ లు దక్కడం లేదని ఏడుకొండలు కామెంట్లు చేశారు. నేను లైఫ్ ఇస్తే సుధీర్ నా ఫోన్ ఎత్తడం లేదు. అతను తన మేనేజర్‌తో మాట్లాడమని చెబుతున్నారు.
నేను నాగబాబు, రోజాతోనే డైరెక్ట్‌గా మాట్లాడాను, ఈయన మేనేజర్‌తో మాట్లాడాలి అట. ఇక జబర్దస్త్ వదిలేసిన గెటప్ శ్రీను బయట షోస్ చేయలేడు. వీళ్ళ గురించి నాకు అంతా తెలుసు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. అవసరమైతే మరో ఇంటర్వ్యూలో అన్ని విషయాలు వెల్లడిస్తా అన్నారు. అయితే ఏడు కొండలు కామెంట్స్‌తో జబర్ధస్త్ వివాదం మరింత రాజుకుంది. అయితే కిరాక్ ఆర్పీ ఆరోపణలు, విమర్సల వెనుక నాగబాబు ఉన్నారనేది పరిశ్రమలో నడుస్తున్న టాక్. ఆయన జబర్ధస్త్‌ని వీడిన సమయంలో డైరెక్ట్‌గా కామెంట్స్ చేశారు. ఇప్పుడు తనను అభిమానించే వారితో విమర్శలు చేయిస్తున్నారని కొందరు కామెంట్స్ చేస్తుండగా, నాగబాబు మాత్రమే ఈ వివాదంకి ముగింపు పలకగలడని కొందరు వాపోతున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఇంకెంత ముందుకు వెళుతుందో.
Operation Sindoor IPL : పహల్గాంలో 26 మంది మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటూ, ముష్కరులను మట్టుబెట్టడమే లక్ష్యంగా…
PM Modi : పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రతి ఒక్క భారతీయుడి రక్తం మరిగింది. పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని…
allu arjun plays dual role in atlee film Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్…
Good News : ఉపాధి హామీ కూలీలు ఉదయం లేచి ఎండ అనక, వానక అనక కష్టపడుతుంటారు. వారికి ఏ…
Samantha : ఎన్నో సంవత్సరాలుగా హీరోయిన్గా కొనసాగుతూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా…
Renu Desai doesn't like it at all Renu Desai : తెలుగు చిత్ర పరిశ్రమలో సుపరిచితమైన నటి…
Pakistani Terror Camps : భారత సైన్యం పాక్ ఉగ్రవాదానికి గట్టి షాక్ ఇచ్చింది. పాక్ లోని మొత్తం 9…
Donald Trump : పహల్గాం ఉగ్రదాడి operation sindoor కి ప్రతీకారంగా భారత India సైన్యం బుధవారం అర్థరాత్రి 1.44…
This website uses cookies.