Kithi Shetty : ఉప్పెన సినిమాతో బేబమ్మ.. అదే కృతిశెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దర్శక నిర్మాతలు ఇప్పుడు ఈ బ్యూటీ డేట్స్ కోసం సంప్రదిస్తున్నారు. చేసింది మూడు సినిమాలైనా స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఉప్పెనలో ముందు మనీషా రాజ్ అనే మరో అమ్మాయిని తీసుకుని తర్వాత ఆమెను కాదని కృతిశెట్టని పైనల్ చేశాడు దర్శకుడు బుచ్చిబాబు. ఉప్పెన2021 ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. ఏకంగా 51 కోట్ల షేర్ వసూలు చేసి సత్తా చాటింది.
ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ కంటే కూడా కృతి ఫెమస్ అయిపోయింది.ఆ తర్వాత నానితో నటించిన శ్యామ్ సింగరాయ్, సంక్రాంతికి వచ్చిన బంగార్రాజులో సర్పంచ్ నాగలక్ష్మిగా ఆకట్టుకోగా.. ఈ సినిమాలు కూడా విజయం సాధించడంతో కృతి డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. దీంతో భారీగా రెమ్యునరేషన్ పెంచిందని టాక్ ఈ విషయం తెలసిన దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నారు.ఉప్పెన సినిమా కోసం బేబమ్మ కేవలం 6 లక్షలు మాత్రమే తీసుకుంది ఇప్పుడు 1.25 కోట్లు కావాలంటోందట. అయితే ముందుగా కమిటైన సినిమాలకు మాత్రం తక్కువగానే తీసుకుంటోందని టాక్.
ప్రస్తుతం ఈమె నితిన్ మాచర్ల నియోజకవర్గం.. సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. రామ్ లింగుస్వామి సినిమాలతో బిజీగా ఉంది. వాటితో పాటు ఇప్పుడు ఒప్పుకునే సినిమాలకు 1.25 కోట్లు కావాలంటుంది కృతి. ఉప్పెన సినిమా పిచ్చెక్కించిన తీరు చూసిన తర్వాత నిర్మాతలు కూడా ఏం పర్లేదు ఇద్దాం అంటున్నారట. కాగా ప్రస్తుతం కృతి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లైట్ కలర్ గౌనులో క్యూట్ గా అమాయకంగా తన అందమైన కురులతో కుర్రకారుని మెస్మరైజ్ చేస్తోంది.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.