Allu Arjun Bail : అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించిన అతనేనా.. వెనక నడిపించిన కథ ఇదేనా..?
ప్రధానాంశాలు:
Allu Arjun Bail : అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించిన అతనేనా.. వెనక నడిపించిన కథ ఇదేనా..?
Allu Arjun Bail : సంధ్యా థియేటర్ పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి కారణం అల్లు అర్జున్ అంటూ చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు చంచల్గూడా జైల్లో అల్లు అర్జున్ ని రిమాండ్లో ఉంచటం తెలిసింది. పుష్ప టు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం వల్లనే ఆయన ఈగో హర్ట్ అయ్యి ఈ అరెస్ట్ చేయించి ఉంటారని కొంతమంది వాదన. మరోపక్క కేటీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూలో బెనిఫిట్ షో ఇచ్చిన హీరో కూడా తన పేరు మర్చిపోయాడని రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశాడు అల్లు అర్జున్ అరెస్ట్ కు ఇది కూడా ఒక ప్రధాన కారణం అయ్యేలా కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
నాటకీయ పరిణామాల మధ్య అల్లు అర్జున్ శనివారం ఉదయం 6 గంటల టైం లో చంచల్గూడా జైలు నుండి విడుదలయ్యాడు. అయితే ఆల్మోస్ట్ 14 రోజులు డిమాండ్ కోర్టు తీర్పు ఇచ్చినా సరే హైకోర్టులో తన తరఫున లాయర్ వాజ్యం వినిపించి బెయిల్ వచ్చేలా చేసుకున్నాడు అల్లు అర్జున్. ఈ మొత్తం స్టోరీ వెనక పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ బెయిల్ కి ప్రధాన కారణం నందమూరి బాలకృష్ణ అని చెప్పుకుంటున్నారు. ఆయనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి అల్లు అర్జున్కి బెయిల్ ఇచ్చేలా చేయాలని చెప్పారట.
Allu Arjun Bail పీపీకి చెప్పి బెయిల్ వచ్చేలా..
హైకోర్టులో వాదనను వినిపిస్తున్న టైం లో రేవంత్ రెడ్డికి ఫోన్ రాగా ఆయన పీపీకి చెప్పి బెయిల్ వచ్చేలా చేయించారని చెప్పుకుంటున్నారు. సో ఈ లెక్కన నందమూరి బాలకృష్ణ వల్లే అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చినట్టు సమాచారం. అయితే ఇందులో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయన్నది తెలియాల్సి ఉంది. ఓ పక్క అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ అంతా ఒకచోట చేరింది. ఈ అరెస్ట్ కి వ్యతిరేకిస్తూ వాళ్లంతా తమ తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
అల్లు అర్జున్ అరెస్టు ఇండస్ట్రీని మరోసారి ఒకే తాటిపై తెచ్చింది. పుష్ప టు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయింది. సక్సెస్ పార్టీ చేసుకోవాల్సిన టైం లో అల్లు అర్జున్ అరెస్ట్ కావటం ఫాన్స్ అందరినీ నిరుత్సాహపరిచింది. అయితే అల్లు అర్జున్ ఇంకా అల్లు అరవింద్ అలు ఫ్యామిలీ మొత్తం సినీ పరిశ్రమ నుంచి వచ్చిన సపోర్ట్ కు చాలా సంతోషకరంగా ఉన్నారు. Balakrishna, Allu Arjun, Allu Arjun Bail, Pushpa 2