Balakrishna : బాలకృష్ణ – బోయపాటి శీనుల సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Authored By vamana sai | The Telugu News | Updated on: January 31, 2021, 4:50 pm

Balakrishna : బాలకృష్ణ – బోయపాటి శీనుల సినిమా నుంచి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సాలీడ్ అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అని ప్రకటించారు మేకర్స్. గత మూడు నాలుగు రోజులుగా టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలతో పాటు యంగ్ హీరోలు నటిస్తున్న సినిమాల రిలీజ్ డేట్స్ ని అధికారకంగా ప్రకటిస్తున్నారు. 2020 లో మిస్ అయిన వినోదాన్ని పదింతలు 2021 లో ఇవ్వడానికి టాలీవుడ్ దర్శక, నిర్మాతలు .. హీరోలు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే తమ సినిమాల రిలీజ్ డేట్ ని లాక్ చేసుకొని అఫీషియల్ గా ప్రకటిస్తున్నారు.

balakrishna-boyapati-srinu-movie-releasing-on-may-28

balakrishna-boyapati-srinu-movie-releasing-on-may-28

ఈ క్రమంలోనే నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా తన సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించాడు. బాలయ్య వరస ఫ్లాపుల్లో ఉండగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సింహా తీసి బాలకృష్ణ కి భారీ కమర్షియల్ హిట్ ని ఇచ్చాడు. సింహా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. సింహా తో ఫాం లోకి వచ్చిన బాలయ్య వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ‘లెజెండ్’ సినిమాతోనూ మరోసారి బాలకృష్ణ కి భారీ హిట్ ని ఇచ్చాడు బోయపాటి శ్రీను.

ఇక ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నార్. రీసెంట్ గా బాలయ్య – ప్రగ్యా జైస్వాల్ మీద ఒక సాంగ్ ని షూట్ చేశారట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాటిలో ఒక పాత్ర అఘోర పాత్ర అని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఈ పాత్ర కోసం రెండు రకాల గెటప్పులు డిజైన్ చేసినట్టు తాజా సమాచారం. ఇక “మోనార్క్” అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా బాలయ్య – బోయపాటిల బీబీ3 ని మే 28 న దేశ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.  ఇందుకు సంబంధించిన బాలయ్య స్టైలిష్ లుక్ ని రిలీజ్ చేయడం విశేషం.

vamana sai

No bio available for this author.

  1. "Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించ‌ని భారీ ట్విస్ట్.. ఈసారి ఎలిమినేట్ అయ్యిది కంటెస్టెంట్..!"

  2. "Jabardasth Faima Pregnancy : జబర్దస్త్ ఫైమా ప్రెగ్నెన్సీ వార్తలో ట్విస్ట్.. నెటిజన్ల ఫైర్ అస‌లేం జ‌రిగిందంటే..?"

  3. "Bigg Boss Telugu 10 : అతను చాలా మంచివాడు.. ఓటేసి గెలిపించండి.. జిమ్ జిమ్ తార లక్ష్మీదేవి వీడియో వైరల్..!"

  4. "Jio Plan : గుడ్‌న్యూస్‌.. జియోలో రూ.123కే రీఛార్జ్ ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ, 14GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్..!"

  5. "Railway Ticket Price : రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 47 రైళ్ల టికెట్ ధరలు తగ్గింపు"

  6. "Scene Movie Review : సీన్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  7. "Ration Card : తెలంగాణలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల పథకం వారికే..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp