Balakrishna : అఖండ భరోసా.. తీరిన రాజమౌళి కోరిక..

Authored By mallesh | The Telugu News | Published on: December 8, 2021, 5:00 pm

Balakrishna : నటసింహం బాలకృష్ణ.. ఈ పేరును తెలుగు సినీ ఇండస్ట్రీకి స్పెషల్‌గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ సీనియర్ టాప్ హీరోల్లో ఈయన ఒకరు. అటు ఎమ్మెల్యేగా పొలిటికల్ లైఫ్‌ను ఇటు హీరోగా సినీ లైఫ్‌ను బ్యాలన్స్ చేస్తున్నారు బాలయ్య. ఈ వయస్సులోనూ తన డైలాగ్స్‌తో, స్టె్ప్పులతో, ఫైట్స్‌తో కుర్ర హీరోలకు తానేమి తక్కువ కాదని నిరూపించుకుంటున్నారు. బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. భిన్నమైన టాక్ సొంతం చేసుకుంటున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టిస్తోంది.

వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ మూవీలో హిట్ అయ్యాయి. ప్రస్తుతం అఖండ సైతం భారీ విజయాన్ని అందుకుంటుండటంతో వీరిద్దరూ హైట్రిక్ కొట్టారు.ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ వేడుకతో ఆడిటోరియంకే కాదు.. మూవీ ఇండస్ట్రీకి ఓ ఊపు తీసుకొచ్చారని చెప్పాడు రాజమౌళి. డిసెంబర్ 2 నుంచి మొదులుకుని థియేటర్స్ సైతం కంటిన్యూగా హౌస్‌ఫుల్ అయ్యే విధంగా టాలీవుడ్ ప్రేక్షకులకు అఖండ మూవీ ఉత్సాహం కల్గించాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు దర్శకధీరుడు. ఆయన కోరుకున్నట్టే ప్రస్తుతం అఖండ మూవీతో థియేటర్స్ అన్ని నిండిపోతున్నాయి.

Balakrishna fulfilled rajamouli wish

Balakrishna fulfilled rajamouli wish

Balakrishna : పెద్ద సినిమాల ప్రొడ్యూసర్లకు ధైర్యం

భారీ బడ్జెట్ మూవీస్ తీయాలా వద్దా? ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారా లేదా అన్న అనుమానాలు బద్దలు కొడుతూ అఖండ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే సుమారు రూ.50 కోట్ల వరకు వసూళ్ల సాధించిందని టాక్. దీంతో పుష్ప, ఆర్‌ఆర్‌‌ఆర్, ఆచార్య, భీమ్లా నాయ‌క్ వంటి పెద్ద సినిమాలు ధైర్యంగా రిలీజ్ చేయొచ్చన్న ధైర్యం ఆ మూవీస్ ప్రొడ్యుసర్స్ కు కలుగుతోంది. మరి అఖండ మూవీ ఇంకెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

mallesh

No bio available for this author.

  1. "Bigg Boss Telugu 10 : హౌస్ నుంచి ఝాన్సీ ఎలిమినేట్.. ముకేశ్ కన్నీళ్లు.. వర్షిణి వీడియోతో షాక్!"

  2. "Irumudi : ఇరుముడి సినిమా ప్రమోషన్లలో చైల్డ్ ఆర్టిస్ట్.. నిర్మాతలకు నోటీసులు ఎందుకంటే?"

  3. "Whatsapp : వాట్సాప్ గ్రూప్‌లో చేరి రూ.1.29 కోట్లు పోగొట్టుకున్న వృద్ధుడు.. మరో రూ.20 లక్షలు డిమాండ్!"

  4. "410 Million Mars Meteorite : భూమిపై పడిన 410 కోట్ల ఏళ్ల నాటి మార్స్ రాయి.. అంగారకుడిపై జీవం ఉందా..?"

  5. "Rapido Driver : నువ్వు సూప‌ర్ గురూ.. ర్యాపిడో పార్సిల్‌లో బంగారం పంపితే.. నగలతో డ్రైవర్ జంప్‌..!"

  6. "Adarsha Kutumbam : వెంకటేష్–త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’కు కాపీరైట్ చిక్కులు.. అసలేం జరిగింది..?"

  7. "Breakup : మూడేళ్ల ప్రేమకు ముగింపు.. స్టార్ హీరో కొడుకుతో ఆ హీరోయిన్ కూతురు లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp